తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా, లోకేష్ గుంటూరు ఎస్పీ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తుంది. రెండు రోజుల క్రితం, పొన్నూరులో, ఒక వైసీపీ ఎమ్మెల్యే ప్రహరీ గోడ ఓపెనింగ్ అంటూ ఒక వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియో తీసింది, మణిరత్నం అనే ఒక వ్యక్తి. అతనిది దళిత సామజికవర్గం. అయితే ఆయన ప్రహరీ గోడ ఓపెనింగ్ అంటూ, ఉన్న ఫ్లెక్స్ వీడియో తీయటం, అలాగే ఆ గోడ మరో పక్క ఏమి లేకపోవటం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్త వైరల్ అయ్యింది. సోషల్ మీడియా మొత్తం అదే వీడియో రెండు రోజులు తిరిగింది. వైసీపీ ఎమ్మెల్యే పై ట్రోల్స్ వచ్చాయి. కియా, హీరో, అపోలో వంటి కంపెనీ ప్రారంభోత్సవాలు చూసిన ఏపి ప్రజలు, ఇలా ప్రహరీ గోడలు, బోరింగ్ పంపులు ఓపెనింగ్ లు చూస్తున్నారు అంటూ కామెంట్స్ వచ్చాయి. అయితే నిన్న ఉదయం ఆ వీడియో పోస్ట్ చేసిన మణి రత్నం అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు అంటూ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అలాగే నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, పోలీసుల విఖరి ని ఖండించారు. కేవలం పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తారా, అతను చేసిన తప్పు ఏమిటి అంటూ పోలీసుల వైఖరిని కూడా తప్పుబడుతూ పోస్ట్ చేసారు. అలాగే ఆ మణిరత్నం అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ నేతలు విడిపించుకుని తీసుకుని వచ్చారు.
అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా, గుంటూరు ఎస్పీ ట్విట్టర్ ఎకౌంటు నుంచి, చంద్రబాబు,లోకేష్ పోస్ట్ చేసిన పోస్ట్ లకు రిప్లై ఇస్తూ, ఇది తప్పుడు సమాచారం అని, ఫేక్ ప్రచారం చేస్తున్నారని, మేము ఎవరినీ అరెస్ట్ చేయలేదని, తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటాం అంటూ, పోస్ట్ చేసారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. సహజంగా ఒక అధికారి నుంచి, ప్రతిపక్ష నేతకు ఇలాంటి రిప్లై రాదు. ఏదో రాజకీయ పార్టీ లాగా,అధికారులు ఇలా రిప్లై ఇవ్వటం పై అందరూ ఆశ్చర్యపోయారు. అయితే దీని పై లోకేష్ మళ్ళీ రిప్లై ఇస్తూ, ఎప్సీ గారు మీకు నిజంగా గడ్స్ ఉంటే పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో సీసీ ఫుటేజ్ బయట పెట్టండి అంటూ సవాల్ విసిరారు. అంతే కాదు, మళ్ళీ బాధితుడి వీడియో కూడా పోస్ట్ చేసారు. నిన్న ఎస్పీ గారు ఫేక్ అన్నారు అని, ఈ రోజు కేవలం ప్రశ్నించటానికి పిలిచామని చెప్పారని, సోషల్ మీడియా పోస్ట్ చేస్తే, పోలీసులు ప్రశ్నిస్తారా అని పోస్ట్ చేస్తూ, మీ లిమిట్ లో మీరు ఉండాలని, మీరు డ్యూటీ చేయాల్సింది ఈ రాష్ట్రానికి, ప్రజలకు అని మర్చిపోకండి అంటూ, ట్వీట్ చేసారు. దీని పై ఇంకా ఎలాంటి స్పందన, గుంటూరు ఎస్పీ నుంచి రాలేదు. మరి ఈ విషయం ఎటు దారి తీస్తుందో చూడాలి.