అమరావతి రైతులు, మహిళలు ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని మంగళగిరిలో కలిసారు. ఈ రోజు జనసేన పార్టీ సమావేశాల కోసం పవన్ కళ్యాణ్ హైదరబాద్ నుంచి మంగళగిరి వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ను అమరావతి రైతులు, మహిళలు కలిసారు. ఇటీవల కాలంలో తమ పై ప్రభుత్వం చేస్తున్న వేధింపులు, 300 రోజులకు పైగా చేస్తున్న పోరాటం పై, పవన్ కు వివరించారు. తమ బాధలు చెప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ ని ముందుండి ఉద్యమం నడిపించాలని కోరారు. వారి బాధలు అన్నీ విన్న పవన్ కళ్యాణ్ , అమరావతి రైతులు, మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. 2014లో అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నప్పుడు, జగన్ రెడ్డికి కనిపించని ఆ ఒక్క కులం, ఇప్పుడెందుకు కనిపిస్తుంది అంటూ ప్రశ్నించారు. తాము మొదటి నుంచి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలనే స్టాండ్ తో ఉన్నామని, దీని వల్ల వేరే ప్రాంతంలో ఇబ్బందులు వచ్చినా, వారికి చెప్పుకుంటామని అన్నారు. ఇక్కడ మహిళలు ఇబ్బందులు పడుతుంటే, వేరే ప్రాంతంలో మహిళలు సంతోషించరని, వారు కూడా మీకు మద్దతు తెలుపుతారని పవన్ కళ్యాణ్ అన్నారు. తనని ఉద్యమం ముందుండి నడిపించాలని కోరుతున్నారని, ఇప్పుడున్న పరిస్థితిలో, ఈ క-రో-నా తగ్గేదాకా కొన్ని పరిమితులు ఉంటాయని, అయితే జేఏసి ఏ పిలుపు ఇచ్చినా, తాము ఆ ఉద్యమంలో పాల్గుంటామని అన్నారు. అయితే ఈ సందర్భంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి అమరావతి అంటుంటే, బీజేపీ మాత్రం, ఎవరు ఇష్టం ఇవచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు.
బయటకు అమరావతి అంటున్న, వైసీపీకి దగ్గరగా సోము వీర్రాజు అండ్ కో మాటలు ఉంటున్నయనే అభిప్రాయం మధ్య, కొంత మంది రైతులు, బీజేపీని అమరావతి విషయంలో గట్టిగా నిర్ణయం తీసుకునేలా చూడాలని పవన్ కళ్యాణ్ ని కోరారు. దీనికి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, తాము బీజేపీతో పొత్తు పెట్టుకోక ముందు నుంచే, బీజేపీ ఒక్క రాజధాని అమరావతికి కట్టుబడి తీర్మానం చేసిందని, కానీ కేంద్రానికి కొన్ని పరిమితులు ఉంటాయని అన్నారు. బీజేపీ, జనసేన వేరు వేరుగా లేమని, వారికి కూడా అమరావతి రాజధానిగా ఉండాలని ఉందని, కాకపోతే బీజేపీ నేతలు మాట్లాడే మాటలు మీకు కొంచెం గందరగోళానికి గురి చేసే విధంగా ఉన్నాయేమో కానీ, బీజేపీ నాయకత్వం మాత్రం సంపూర్ణంగా అమరావతిని రాజధానిగా ఉండాలని కోరుకుంటుందని అన్నారు. గతంలో కూడా అమరావతి రాజధాని అనే విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదని, ఇప్పుడు కూడా జోక్యం చేసుకునే అవకాసం లేదని, మన దేశంలో ఉన్న ఫెడరల్ వ్యవస్థలో కొన్ని పరిమితాలు ఉంటాయని అన్నారు. అయితే బీజేపీ నాయకత్వం మాత్రం, అమరావతే రాజధాని మా విధానం అదే అని మాకు చెప్పారు కాబట్టి, ఇంత బలంగా చెప్తున్నానని, కానీ కొంత మాటలు చెప్పే విధానం మనకు రుచించక పోవచ్చని, లేదా వారి మాటలు నమ్మసక్యంగా లేకపోవచ్చు కానీ, మేము మాత్రం అమరావతి తరుపున బలంగా నిలబడతాం అని పవన్ కళ్యాణ్ అన్నారు.