సొంత ప్రభుత్వం పైనే ఈ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలు ఎదురు తిరుగుతున్నారు. అనేక సందర్భాల్లో ఈ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన గళం వినిపిస్తున్నారు. అయితే ఇప్పుడు మరో ఎమ్మెల్యే నిరసనగళం విప్పారు కానీ, డైరెక్ట్ గా ప్రభుత్వం పై కాకపోయినా, ప్రభుత్వ చేతకాని తరం గురించి ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావిస్తూ, కాంట్రాక్టు సంస్థ కార్యాలయ ముట్టడికి సిద్ధం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డుల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. ఏ రోడ్డు చూసినా, ఏ రోడ్డు అయినా, అన్నీ గోతులు, గుంతలే. రాష్ట్రం మొత్తం పరిస్థితి ఇలాగే ఉంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ఇంటర్నల్ రోడ్స్ కూడా ఇలాగే ఉన్నాయి. ప్రజలు ప్రతి రోజు ఇబ్బందులు పడుతున్నారు. అయితే అక్కడక్కడా ప్రజలు ఎదురుతిరుగుతున్నా, ప్రభుత్వం పై మాత్రం ఒత్తిడి తెచ్చే వారు లేరు. మనకు ఎందుకు వచ్చిందేలా అని ఇబ్బందులు పడుతూనే వెళ్తున్నారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు మాత్రం, సొంత ప్రభుత్వం పైనే ఎదురు తిరిగినంత పని చేసారు. గుంటూరు జిల్లా ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి సీరియస్ అయ్యారు. పిడుగురాళ్లలో రోడ్డులు అధ్వానంగా ఉన్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసినా, ఎన్ని సార్లు చెప్పినా, రెండు వారాలు గడువు ఇచ్చినా, కాంట్రాక్టు సంస్థ మాత్రం మరమత్తులు చేయలేదని ఆయన అన్నారు.

kasu 21112020 2

ఈ నెల 29వ తేదీన తుమ్మలచెరువు టోల్‌గేట్‌ను ముట్టడి చేస్తామని, ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి అన్నారు. అయితే ఇక్కడ కాంట్రాక్టర్ వైసీపీ ఎంపీ ఎంపీకి చెందిన సంస్థ. రాంకీ సంస్థ పరిధిలోనే ఇది ఉంది. వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డిది రాంకీ సంస్థ. దీంతో సొంత ప్రభుత్వం పైన, సొంత పార్టీ ఎంపీ సంస్థ పైనే , అధికార పార్టీ ఎమ్మెల్యే నిరసన గళం వినిపించారని అనుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి, ఆయన ఏమి చేసినా తెలుస్తుంది కానీ, ప్రజలు ఇలా ఎదురు తిరిగితే ఊరుకుంటారా ? ఏది ఏమైనా అధికార పార్టీ ఎమ్మెల్యే నిరసనతో అయినా ప్రభుత్వం ఈ సమస్య గుర్తించి, ఈ సమస్యని పరిష్కారం చేస్తే, ప్రజలకు మేలు జరుగుతుంది, అలాగే ప్రజా సమస్య పరిష్కారం చేసినందుకు, అధికార పార్టీ ఎమ్మెల్యేకే పేరు వస్తుంది. చూద్దాం, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుంది ఏమో,.

Advertisements

Advertisements

Latest Articles

Most Read