ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే దాని పై క్లారిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన కూడా విడుదల చేసారు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి, ఇందులో చాలా కీలక అంశాలు పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా పడిన నేపధ్యంతో పాటు, అలాగే ఇతర రాష్ట్రాల్లో, అంటే హైదరాబాద్ లో ఎన్నికలు వంటివి ప్రస్తావించారు. అదే విధంగా రాజస్తాన్ లో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని అక్కడ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవటం, అయితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇది సరైన సమయం కాదని పేర్కొందని, అయితే ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా, ఫలితం లేకపోయిందని, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, అక్కడ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఇదే సమయంలో, ఆంధ్రప్రదేశ్ లో గతంలో రోజుకు 10 వేల క-రో-నా కేసులు నమోదు అయ్యాయని, ఇప్పుడు 700కి పడిపోయిందని, ఈ సందర్భంగా ఉదాహరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎన్నికలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న పిల్, అందులో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు, తాము ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీలతో ఎన్నికల పై సమావేశం నిర్వహించానని అన్నూర్.

nimmagadda 17112020 2

ఈ సమావేశంలో అనేక పక్షాలు తమ అభిప్రాయాలు తెలిపయాని అన్నారు. దీంతో పార్టీ ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహనీ, ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయానికి వచ్చి, తమ అభిప్రాయం తెలిపారని, అయితే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించటం సాధ్యం కాదని పేర్కొన్నారని, సెకండ్ వేవ్ వస్తుందని కేంద్రం ప్రభుత్వం, ఇతర సంస్థలు చెప్తున్న నేపధ్యంలో, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించటం సాధ్యం కాదని చెప్పారని వివరించారు. అయితే ఇదే సందర్భంలో రాజస్తాన్ లో, ఢిల్లీలో, హైదరాబాద్ లో ఎన్నికలు నిర్వహిస్తున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికలు నిర్వహించటం అవసరం అని అన్నారు. ఇక అలాగే రాజ్యంగ పరమైన ఆబ్లిగేషన్ తో పాటుగా, కేంద్రం ఆర్ధిక సంఘం ఇచ్చే నిధులు పంచాయతీలు కూడా తీసుకోవాల్సి ఉంటుందని, వీటి అన్నిటి నేపధ్యంలో, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమాయత్తం అవుతున్నాం అని అన్నారు. తాము ఎప్పటికప్పుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి అంచనా వేస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని, నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read