దేశ వ్యాప్తంగా దీపావళి పండుగ సంబరాలకు రెడీ అవుతున్నారు. దీపావళి అంటేనే పిల్లల పండుగ. టపాసులు కాలుస్తూ, పండుగ చేసుకుంటారు. దీపాల పండుగగా చేసుకోవాలని, కొంత మంది ప్రతి ఏడు ఉద్యమాలు చేస్తున్నా, దీపావళి అంటేనే టపాసులు అని, వివిధ సందర్భాల్లో, న్యూ ఇయర్ వేడుకల్లో, రాజకీయ పార్టీల మీటింగుల్లో టపాసులు కాలిస్తే లేనిది, ఇప్పుడే వచ్చిందా అంటూ, హిందూ సంస్థలు కౌంటర్ ఇస్తూ వచ్చేవి. అయితే ఈ సారి మాత్రం క-రో-నా వైరస్ ఉండటంతో, కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, దీపావళి సంబరాల పై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు దీని పై నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీపావళి సంబరాల పై పలు కీలక సూచనలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మూడు రోజుల క్రితం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటించింది. దీపావళి పండుగ రోజున, రెండు గంటల పాటు దీపావళి సంబరాలు చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది. దీపావళి రోజున రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే, ఈ రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే టపాసులు అమ్మకాల పై కూడా ఆంక్షలు వధించింది. కేవలం గ్రీన్ క్రాకెర్స్ మాత్రమే అమ్మాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక టపాసులు అమ్మే షాపుల్లో, శానిటైజర్ ను వాడవద్దు అని కూడా సూచనలు ఇచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read