ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంపై, గత కొంత కాలంగా, కేంద్రం ఇస్తున్న షాకులతో రాష్ట్ర ప్రభుత్వం అల్లాడి పోతుంది. అటో ఇటో అయితే, పోలవరం ప్రాజెక్ట్ రాజకీయ అజెండాగా మారి, అధికరాన్నే కోల్పోయే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం, గతంలో చంద్రబాబు హయాంలో ఆమోదించిన 55 వేల కోట్లు కాకుండా, కేవలం 20 వేల కోట్లు మాత్రమే పోలవరం ప్రాజెక్ట్ కు ఇస్తాం అంటూ మెలిక పెట్టింది. దీని పై జగన్ మోహన్ రెడ్డి, ఒక వారం రోజులు తరువాత ఒక లేఖ కేంద్రానికి రాయటం మినిహా, పెద్దగా కేంద్రం పై పోరాడింది ఏమి లేదు. అయితే దీని పై, తర్జనబర్జనలు జరుగుతూ ఉండగా, గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన డబ్బుల్లో, 2,234.288 కోట్లు రీయింబర్స్ చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్ధిక శాఖ దీనికి సంబంధించి ఆమోదం తెలిపింది. దీంతో ఇక ఇది మా విజయం అంటూ, వైసీపీ నేతలు ఊదరగొడుతున్నారు. చంద్రబాబు ఖర్చు పెట్టిన డబ్బులు తేలేకపోయారు, మేము తెచ్చేస్తున్నాం అంటూ హడావిడి చేస్తున్నారు. ఒక పక్క పోలవరం అంచనాలు 30 వేల కోట్లకు తగ్గిచేస్తుంటే, దాని పై గట్టిగా మాట్లాడరు కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన సొమ్ము, ఇప్పుడు వస్తుంటే హంగామా చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో కేంద్రం మరో మెలిక పెట్టి, రాష్ట్రానికి షాక్ ఇచ్చింది.
పోలవరం డబ్బులు రీయింబర్స్ మెంట్ చేయాలి అంటే, డైరెక్ట్ ఏపి ఎకౌంటు లో వేయమని, రాష్ట్ర ప్రభుత్వం, ఒక సరికొత్త పీడీ ఎకౌంటు ఇవ్వాలని, మేము ఆ పీడీ ఎకౌంటు లోనే డబ్బులు వేస్తామని కేంద్రం షరతు పెట్టింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఒక కొత్త పీడీ ఎకౌంటు ఓపెన్ చేసే పనిలో ఉంది. పీడీ ఎకౌంటు లో వేస్తే, దేని కోసం అయితే కేంద్రం డబ్బులు ఇస్తుందో, అది దానికి మత్రమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. గతంలో కూడా 1800 కోట్లు రీయింబర్స్ మెంట్ ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వ ఆ డబ్బులు వేరే వాటికి ఖర్చు చేసేసిందనే లెక్క కేంద్రానికి వెళ్ళింది. పోలవరం కోసం ఇచ్చే డబ్బు, పోలవరం ప్రాజెక్ట్ కు మాత్రమే ఖర్చు పెట్టాలని, అందుకే ఒక కొత్త పీడీ అకౌంట్ ను కేంద్రం ఇవ్వమని, రాష్ట్రాన్ని కోరింది. ఈ నిధులు వేరే వాటికి వాడుకునే వెసులుబాటు రాష్ట్రానికి ఉండదు. ఇప్పటి వరకు అనేక సార్లు, రాష్ట్ర ప్రభుత్వం, వివిధ నిధులు, వివిధ అవసరాలకు మళ్ళించింది అనే వార్తలు విన్నాం. ఇప్పుడు పోలవరం విషయంలో అది కుదరదు. రాష్ట్ర ప్రభుత్వం పీడీ ఎకౌంటు అడిగింది అంటే, రాష్ట్రం పై నమ్మకం లేకే అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రం పీడీ ఎకౌంటు ఇచ్చిన వారం పది రోజులకు, ఈ 2,234.288 కోట్లు వచ్చే అవకాసం ఉంది. ఇవన్నీ సాఫీగా రాష్ట్రానికి చేరతాయో, లేక మధ్యలో మరో మెలిక పెడతారో చూడాలి.