కోర్టుల్లో దాఖలు అయ్యే వివిధ పిటీషన్ లు ఏ బెంచ్ ముందుకు వెళ్ళాలి, ఎవరు వాదించాలి అనే అంశాలు ఆయా కోర్టుల చీఫ్ జస్టిస్ లు నిర్ణయిస్తూ ఉంటారు. జడ్జిల అనుభవం, ఆ సబ్జెక్ట్ పై ఉన్న సామర్ధ్యం, ఇలా వివిధ అంశాలు తీసుకుని, రోస్టర్ విధానంలో కేసులు, ఆయా బెంచ్ లకు కేటాయిస్తూ ఉంటారు. ఒక్కో బెంచ్ ముందుకు, ఒక్క రకం వ్యాజ్యాలు వచ్చేలా, రోస్టర్ పై, ఆయా కోర్టుల చీఫ్ జస్టిస్ లకు అధికారం ఉంటుంది. ఆయా కోర్టుల చీఫ్ జస్టిస్ లు ఈ నిర్ణయం తీసుకుంటారు. సుప్రీం కోర్టులో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టులో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఇవి ప్రతిసారి కొంత సమయానికి మారిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా సుప్రీం కోర్తు చీఫ్ జస్టిస్ కొత్త రోస్టర్ విడుదల చేసారు. ఏ కేసు, ఏ బెంచ్ తీసుకోవాలి అనే అంశం పై, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ బాబ్డే రోస్టర్ విడుదల చేసారు. జనవరి 4 నుంచి ఈ కొత్త రోస్టర్ ప్రకారమే, జడ్జిల ముందుకు ఆయా కేసులు వస్తాయి. అయితే ఈ కొత్త రోస్టర్ ప్రకారం, చీఫ్ జస్టిస్ బాబ్దే బెంచ్, కీలకమైన ఎన్నికలు, హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, సోషల్ జస్టిస్ కు సంబంధించిన కేసులు, కోర్టు ధిక్కరణ, రాజ్యాంగ పరమైన అపాయింట్మెంట్ లు, మైన్స్, మినరల్స్, కమిషన్ ఎంక్వయిరీ లాంటివి, చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు వస్తాయి.

sc 29122020 2

అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన, కాబోయే చీఫ్ జస్టిస్, ఎన్వీ రమణకు కీలకమైన కేసులు అప్పగించారు. ప్రజాప్రయోజన వాజ్యాలు, సామాజిక న్యాయం, క్రిమినల్ మ్యాటర్స్, సివిల్ మ్యాటర్స్, ఆర్బిట్రేషన్ కు సంబంధించి, పరిహారంకు సంభందించి, సామాజిక విషయాలు, జ్యూడీషియల్‌ అధికారులకు సంభందించి, ఇలా పలు కీలక కేసులను జస్టిస్‌ ఎన్వీ రమణ బెంచ్ కు కేటాయించారు. అయితే ఈ బెంచ్ లలో ఇతర న్యాయమూర్తులు కూడా ఉంటారు. బ్యాంకింగ్ కు సంబందించిన కేసులను జస్టిస్‌ నారిమన్‌ బెంచ్ కు కేటాయించారు. అలాగే ఇతర సుప్రీం కోర్టు జడ్జీలు అయిన, జస్టిస్‌ లలిత్, జస్టిస్‌ ఖన్విల్కర్, జస్టిస్‌ చంద్రచూడ్, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ లావు నాగేశ్వర రావు బెంచ్ లకు కూడా వివిధ కేసులు కేటాయించారు. ఇలా సుప్రీం కోర్టు రోస్టర్ ను, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ప్రకటించారు. త్వరలోనే చీఫ్ జస్టిస్ బాబ్డే రిటైర్డ్ అవ్వనున్నారు. ఈ లోపే జస్టిస్ ఎన్వీ రమణను చీఫ్ జస్టిస్ గా నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు ఈ రోస్టర్ విధానం కొనసాగే అవకాసం ఉంది, లేకపోతే సిజీ నిర్ణయం తీసుకుంటే, మళ్ళీ మధ్యలో మారొచ్చు కూడా.

Advertisements

Advertisements

Latest Articles

Most Read