ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనదైనశైలిలో సరికొత్తగా రూ.లక్షా20వేలకోట్ల కుంభకోణానికి తెరలేపారని, రాష్ట్రానికి అవస రం లేకపోయినా, పదివేలమెగావాట్ల సోలార్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినప్రభుత్వం, వాటిపేరుతో లక్షా20వేలకోట్ల స్కామ్ కు సిద్ధమైం దని టీడీపీ జాతీయఅధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! డిసెంబర్ 28వతేదీన సోలార్ ప్రాజెక్ట్ కలకు సంబంధించి బిడ్లు దాఖలయ్యాయి. సోలార్ విద్యుత్ పార్కుల ఏర్పాటు తొలిదశలో 6050 మెగావాట్లకు సంబంధించి, టెండర్లదాఖలుకు నిన్ననే ఆఖరి తేదీ. కడపజిల్లాలోని చక్రాయపేటలో 500 మెగావాట్లు, తొండూరులో 400మెగావాట్లు, అదేజిల్లాలోని కంభాలదిన్నెలో 550 మెగావాట్లు, పెండ్లిమర్రిలో మరో500మెగావాట్ల పార్కుల ఏర్పాటుకు నిర్ణయించుకున్నారు. ప్రకాశంజిల్లాలోని రామ సముద్రంలో 600మెగావాట్లకు, మరో600 మెగావాట్లు అదేజిల్లా లోని సీ.ఎస్.పురంలో, ఉరిచింతలో మరో 600 మెగావాట్లు, కంబద్దూరులో 120 మెగావాట్లు, ముదిగుబ్బ, కొలిమి గుండలో మరో 500, 600 మెగావాట్ల పార్కుల ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కడప, ప్రకాశం జిల్లాలలో 6050 మెగావాట్ల సోలార్ పార్కుల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. పదిసోలార్ ప్రాజెక్ట్ పార్కులకు సంబంధించి దాఖలైన బిడ్లు కేవలం 24 మాత్రమే. అంటే ఒక్కో ప్రాజెక్టుకు రెండుకంటే మించి దాఖలవ్వలేదు. ఒకటో, రెండో ఎక్కువ దాఖలు చేశారు. తక్కువ గా దాఖలైన బిడ్లలో అధికంగా బిడ్లువేసిన సంస్థల్లో ఒకటి అదానీ గ్రూప్అయితే, మరోటి షిరిడిసాయి ఎలక్ట్రికల్స్. ఈ రెండో సంస్థ పేరు ఎవరైనా, ఎప్పుడైనా విన్నారా? ఆ షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ అనేది కడపజిల్లాకు చెందిన నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డిది. ఆసంస్థకు సోలార్ విద్యుత్‌ఉత్పత్తిలో ఎటువంటి అనుభవంలేదు. విశ్వేశ్వరరెడ్డి అనే పెద్దమనిషి ఎవరయ్యా అంటే, స్వయంగా వైసీపీఎంపీ, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సిన్నిహితుడు అయిన వై.ఎస్.అవినాశ్ రెడ్డికి బినామీ.
అవినాశ్ రెడ్డి చేతిలో కీలుబొమ్మ అయిన నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డికి చెందిన కంపెనీకి, జగన్ అనుంగు అనుచరుడైన వ్యక్తికి చెందిన బినామీ కంపెనీకి లక్షా20వేలకోట్లు దోచిపెట్టడానికి పథకరచన చేశారని తేలిపోయింది. జగన్ సార్ ఆలోచన ఎంత అద్భుతంగా ఉందో ప్రజలంతా ఆలోచించండి. సోలార్ పవర్ పార్కుల పేరుతో ముఖ్యమంత్రి అలాతనవాళ్లకు దోచిపెడుతుంటే చూస్తూ ఊరుకు నేది లేదు. షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ కు దోచిపెట్టడానికి ప్రభుత్వం ఎన్ని జిమ్మిక్కులు చేసిందో, నిబంధనలను అడ్డగోలుగా ఎలా మార్చిందో కూడా ప్రజలకు చెప్పబోతున్నాను. 15-06-2020న జీవోనెం-18 ఇచ్చారు. ఆ జీవోలో మొదటి 15ఏళ్లకు ప్లాట్ టారిఫ్ అని, తరువాతి 15 ఏళ్లకు ‘O’ అండ్ ‘M’ కు సరిపడా రెడ్యూస్ డ్ టారిఫ్ అని పేర్కొన్నారు. ఆ తరువాత మరో జీవో ఇచ్చారు. 17-07-2020న ఇచ్చినజీవో నెం-19లో మరలా నిబంధనలు మార్చారు. దానిలో15 సంవత్సరాల ఫిక్స్ డ్ టారిఫ్ విధానాన్ని ఏకంగా 25సంవత్సరాలకు పెంచేశారు. జీవోనెం-18లో చెప్పింది మొత్తం మార్చేసి, ఒకేసారి 25ఏళ్లకు ఫిక్స్ డ్ టారిఫ్ కట్టబెట్టేలా జీవోనెం-19 తీసుకొచ్చారు. ఎందుకు అలా మార్చాలో చెప్పాలి. బినామీ కంపెనీకి దోచిపెట్టడానికే జీవోను మార్చారు. రూ.లక్షా20వేలకోట్లను సోలార్ విద్యుత్ పేరుతో దోచుకోవడానికి ఏకంగా 15 నుంచి 25సంవత్సరాలకు ఫిక్స్ డ్ టారిఫ్ ఇచ్చేస్తూ జీవోను మార్చేశారు. 07-11-2020న ఇచ్చిన జీవోనెం -25లో తిరిగి మరలా నిబంధనలు మారుస్తూ, పీపీఏల కాలపరిమితిని 25 సంవత్సరాల కాలపరిమితిని 30ఏళ్లకు పెంచారు. అసెంబ్లీలో పీపీఏలు 25 సంవత్సరాల కాలపరిమితితోఉండటమే పెద్దనేరమన్నట్లు మాట్లాడిన ముఖ్యమంత్రి, నేడు ఏరకంగా 30ఏళ్లకుకాలపరిమితి పెంచారో సమాధానంచెప్పాలి?
“ టెక్నాలజీ వల్ల రేట్లు తగ్గుతాయనే స్పృహఉంటే, పీపీఏల కాలపరిమితిని 25ఏళ్లకు ఎందుకు విధించారని, బుద్ధి, జ్ఞానం ఉన్నఎవరైనా 25ఏళ్లపాటు పీపీఏలు చేసుకుంటారా” అని అసెంబ్లీలో జగన్ అన్నాడు. అలాంటి జగన్ బుద్ధి నేడు ఏమైంది? ఆయన బుద్ధి అరికాలులోకి వెళ్లిందా.. లేక మోకాల్లోకి జారిందా? బుద్ధి, జ్ఞానం ఉన్నవాడు ఎవడూ 25ఏళ్ల నిబంధనపెట్టుకోడని అసెంబ్లీలో చెప్పినవ్యక్తి, నేడు 30ఏళ్లకు ఎలాఒప్పుకున్నాడు? 25సంవత్సరాలు ఒప్పందం చేసుకోవడమే నేరము, ఘోరమని చెప్పిన వ్యక్తి, జీవోనెం-25లో 30సంవత్సరాల కు కాలపరిమితిని ఎందుకు పెంచాడు? నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డికి దోచిపెట్టడానికి పెంచాడా? ప్రజలసొమ్ముని దోచుకోవడానికి ఇష్టానుసారం జీవోలిస్తారా? అంతా తనవాళ్లకే దోచిపెడుతున్న ముఖ్యమంత్రి సోలార్ పార్కుల ఏర్పాటుకు అవసరమైన భూమి సేకరించాలంటే రైతులనుంచే తీసుకోవాలి. అలాంటి రైతులకు మాత్రం ఆయన చేస్తున్న మేలుశూన్యం. ఒకపక్కన పంటలబీమా, ఇన్ పుట్ సబ్సిడీ, కనీసమద్ధతుధరవంటివి ఇవ్వకుండా, వారిని వేధిస్తు న్నారు. మరోపక్క సోలార్ పార్కుల ఏర్పాటుకు అవసరమైన భూమిని రైతులదగ్గరనుంచి సేకరిస్తూ, వారికి అతితక్కువధర చెల్లించడానికి సిద్ధమయ్యారు. సంవత్సరానికి ప్రతిరైతుకు ఎకరాకు రూ.31వేలవరకు కౌలు చెల్లించాల్సి ఉండగా, దాన్ని రూ.25వేలకు తగ్గించాడు. రైతులకు ఈ విధంగా అన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మనిషేనా?
అదే జీవోనెం-25లో మరోనిబంధన చేర్చారు. సోలార్ విద్యుత్ టెండర్లు దక్కించుకున్నవారు గ్రీన్ షూవిధానంద్వారా 50శాతం విద్యుత్ ఉత్పత్తిని వారికి వారేపెంచుకునే అవకాశం కల్పించారు. నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డిని అడ్డుగాపెట్టుకొని దోచుకోవడానికి సిద్దమైనవారే పీపీఏల కాలపరిమితిని పెంచేశారు. లీజు నిబంధనలు మార్చేశారు. రైతులుకు ఇచ్చేదానిలో కోతపెట్టారు. ఈ విధంగా దగుల్బాజీ పనులుచేయడంకోసం తనకు అనుకూలమైన వ్యక్తిని ముఖ్యమంత్రి నియమించుకున్నాడు. ఏపీ సోలార్ కార్పొరేషన్ సీఈవోగా మరో 420ని నియమించాడు. ఎమ్. మురళీకృష్ణారెడ్డి అనే రబ్బర్ స్టాంప్ ని నియమించారు. అతన్ని నియమించడంకోసం జీవోనెం- 92ను 07-11-2020న విడుదల చేశారు. కండీషన్లు మారుస్తూ, జీవో ఇచ్చిన రోజే, (07-11-2020) రబ్బర్ స్టాంప్ ను నియమిస్తూ మరోజీవోఇస్తారా? దీనితోనే మీకుట్రలు అన్నీ అర్థమువుతున్నాయిగా. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ కు సీఈవోగా నియమించిన మురళీకృష్ణారెడ్డి ఏపీ జెన్ కో లో కేవలం డీఈఈ మాత్రమే పనిచేశాడు. హవాలా కింగ్ బాలినేని శ్రీనివాసరెడ్డి కి ఓఎస్ డీగా ఉన్న మురళీకృష్ణారెడ్డిని, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ కు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఏవిధంగా నియమస్తారు? మంత్రుల దగ్గరపీఏగా పనిచేసిన వ్యక్తిని సోలార్ కార్పొరేషన్ కు బాస్ గా నియమిస్తారా? ఇది మీస్కామ్ కోసం పన్నినకుట్ర కాదా?
థర్మల్ విద్యుత్ వాడకపోతే, థర్మల్ పవర్ యూనిట్ల నిర్వహణ కోసం ఫిక్స్ డ్ ఛార్జీలు చెల్లించాలని అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రి , నేడు 1650 మెగావాట్ల ఆర్ టీ పీపీని ఎందుకు మూసేశాడో, ఆ భారాన్ని ఎవరిపై వేస్తున్నాడో ఆయనే చెప్పాలి. టీడీపీ తరుపున అడిగిన ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. జీవోనెం-18తరువాత, జీవోనెం-19ని, తరువాత జీవోనెం-25ని ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలి. జీవోనెం 25లో పీపీఏల కాలపరిమితిని ఎందుకు పెంచారో, రైతులకు ఇవ్వాల్సిన కౌలుని ఎందుకు తగ్గించారో స్పష్టంచేయాలని డిమాండ్ చేస్తున్నాను. 5వేలమిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ అందుబాటులో ఉండగా, కావాలని 10వేలమెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఎందుకు సిద్ధమయ్యారో చెప్పాలి. సోలార్ విద్యుత్ టెండర్లలో వేరే కంపెనీలు టెండర్లు ఎందుకు వేయలేదో చెప్పాలి. తనబినామీలకు దోచిపెట్టడా నికే మిగిలినకంపెనీలు టెండర్లు వేయకుండా అడ్డుకున్నారు. రాష్ట్రానికి అవసరం లేకపోయినా విద్యుత్ ఉత్పత్తి పేరుతో రూ.లక్షా20వేలకోట్ల దోపిడీకి అవినాశ్ రెడ్డి బినామీ అయిన నర్రెడ్డి విశ్వేశ్వర్‌రెడ్డికి చెందిన షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ ద్వారా ముఖ్యమంత్రి తెరలేపారు. సోలార్ విద్యుత్ కి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి ఒక్కఅడుగు ముందు కేసినా, టీడీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాము.