టిడీపీ అధికార ప్రతినిధి, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వరుస పీట్టి, వైసీపీ ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలు అంటూ బయట పెడుతున్నారు. నిన్న 108 స్కాం బయట పెట్టిన పట్టాభిరాం, నేడు మరో అవినీతి గురించి ఆరోపణలు చేసారు. ఆయన మాట్లాడుతూ, "వైకాపా మాదిరి నిరాధార ఆరపణలు చేయడం తెలుగుదేశం పార్టీకి చేతకాదు. 108 వాహనాల కుంభకోణంపై వాస్తవాలు ప్రజల ముందు ఉంచాం. వారం రోజులు గడిచినా ఒక్క సారి కూడా విజయసాయిరెడ్డి దీనిపై స్పందించలేదు, కనీసం ట్వీట్ కూడా చేయలేదు. సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి సహా ఒక్క వైకాపా నాయకుడు కూడా మీడియా ముందు వివరణ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు సరస్వతి ఇండస్ట్రీస్ కు సంబంధించిన అవినీతిని ప్రజల ముందు ఉంచుతున్నాను. సరస్వతి ఇండస్ట్రీస్ లో వాటాలు ఉన్నాయని సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే 2019 ఎలక్షన్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆయన సతీమణి శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు అనెక్జర్-2 లో తెలిపారు. 15.07.2008న సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కు సంబంధించి జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. అందులో డైరక్టర్ లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి, శ్రీమతి వైఎస్ విజయ గారు నాడు మీటింగ్ లో పాల్గొన్నారు. అప్పటి వరకు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ బైలాస్ లో సిమెంట్ కర్మాగార ప్రస్తావన లేదు."

"15.07.2008 న మీటింగ్ నిర్వహించి సిమెంట్ ఇండస్ట్రీస్ కూడా నిర్వహించేకునే విధంగా బైలాస్ లో సవరణ తీసుకొచ్చారు. కానీ 12.06.2008 న మైన్స్ అండ్ జియాలజీ నుంచి వచ్చిన మెమో ఆధారంగా సరస్వతి పవర్స్ ఇండస్ట్రీస్ కు గనులు కేటాయించినట్లు 18.05.2009న విడుదల చేసిన జీవో నెం.107 లో పేర్కొన్నారు. అంటే కంపెనీ బైలాస్ లో సిమెంట్ కంపెనీ ప్రస్తావణ రాకముందే.. సిమెంట్ కంపెనీకి భూకేటాయింపులకు సంబంధించిన ఫైల్ మూవ్ చేశారని అర్థమవుతోంది. నాడు మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక కంపెనీ బైలాస్ సవరించకుండానే.. భూకేటాయింపులకు సంబంధించి మెమోను మూవ్ చేసుకున్నారు. ఆరోజు సంబంధిత శాఖకు సెక్రటరీగా శ్రీమతి వై.శ్రీ లక్ష్మి గారు ఉన్నారు. ఈమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అనేక కుంభకోణాల్లో నిందితురాలిగా జైలుపాలైన ఐఏఎస్ అధికారిణి. ఇటువంటి అధికారుల భాగస్వామ్యంతో కంపెనీ బైలాస్ సవరించుకుండానే.. 613.70 హెక్టార్ల భూమిని కేటాయించుకున్నారు. సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి రెండేళ్ల తర్వాత కూడా ఎటువంటి అడుగులు పడకపోయేసరికి.. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఈ కంపెనీకి షోకాజ్ నోటీసును పంపింది. 17.02.2012న మొదటి షోకాజ్, 02.06.2012న రెండో షోకాజ్ ను అప్పటి ప్రభుత్వం సరస్వతి ఇండస్ట్రీస్ కు పంపడమైనది. షోకాజ్ నోటీసులకు కంపెనీ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడం, సరైన డాక్యుమెంట్లు అందించలేకపోవడం కారణంగా.. 23.08.2014న మైన్స్ అండ్ జియాలజీ శాఖ మైనింగ్ లీజును రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది."

"దీంతో 09.10.2014న అప్పటి ప్రభుత్వం మైనింగ్ లీజులు రద్దు చేస్తూ.. జీవో నెం.98 విడుదల చేసింది. మైనింగ్ లీజును రద్దు చేయడానికి గల కారణాలను కూడా ఆ జీవోలో అప్పటి ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. మైనింగ్ లీజులను పునరుద్ధించాలని కోరుతూ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ 06.11.2014న కోర్టును ఆశ్రయించింది. ఈ కంపెనీకి 29.03.2012 నుంచి ఏడేళ్ల పాటు 29.03.2019 వరకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి పర్యావరణ అనుమతులు వచ్చాయి. రోజుకు 2,855 ఎం.క్యూబ్ నీటిని మాత్రమే వినియోగించాలని కేంద్ర పర్యావరణ శాఖ కండిషన్స్ ను విధించింది. రోజుకు 2,855 ఎం.క్యూబ్ నీరు అంటే ఏడాదికి 0.0368 టీఎంసీల నీరు అవుతుంది. పర్యావరణ అనుమతుల కాలపరిమితి ముగియడటంతో.. రెన్యువల్ కు 19.02.2019న మరలా అప్లై చేశారు. అందులో రాష్ట్రంలో నూతన రాజధాని నిర్మాణం జరుగుతోందని.. అందుకు సిమెంట్ అవసరం ఉంది కనుక సిమెంట్ కంపెనీకి పర్యావరణ అనుమతులు ఇవ్వమని కోరారు. మీ కంపెనీ పర్మిషన్స్ కోసం రాజధాని గూర్చి చాలా గొప్పగా పొగిడారు. మీ వ్యాపారాల అవసరాల కోసం మాత్రమే మీకు రాజధాని గుర్తుకు వస్తుందా..? పర్యావరణ అనుమతుల కోసం కేంద్రానికి సమర్పించిన ఫాం నెం.1 ను కూడా అసత్యాలతో నింపారు. సిమెంట్ కంపెనీ నిర్మించాలనుకుంటున్న స్థలానికి సంబంధించిన జీవో ఏమైనా పెండింగ్ లో ఉందా..? అని ఫాం.నెం.1 లోని 22 వ పాయింట్ లో ఉంటే లేదని రాశారు. జీవో నెం. 98 అమలులో ఉంటే లేదని ఎలా రాశారు..? పాయింట్ నెం.24లో కోర్టులలో లిటిగేషన్స్ ఏమన్నా పెండింగ్ లో ఉన్నాయా..? ఉంటే పిటిసన్ నెంబర్లు పేర్కొనమంటే ‘నన్’ అని రాశారు."

"మీరు వేసిన రిట్ పిటిషన్ ను ఎందుకు పేర్కొనలేదు..? ముఖ్యమంత్రిగా ఉంటూ నీతి, నిజాయతీగా ఉండాల్సిన మీరు.. ఆ పదవిని అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్నారు. వ్యాపార ప్రయోజనాల కోసం గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మీకులా తప్పుడు అఫిడవిట్లు, తప్పుడు ఫాంలు సమర్పించలేదు, రాజ్యాంగబద్ధ సంస్థలను తప్పుదోవ పట్టించలేదు. మీరు తొక్కిపెట్టిన వాస్తవాలు తెలియక కేంద్రం కూడా పర్యావరణ అనుమతులను మూడేళ్లు పొడిగిస్తూ.. 03.07.2019న ఆర్డర్ ఇచ్చింది. అదే అప్లికేషన్ పార్ట్ నెం.2 సీరియల్ నెం.1.1లో 613.47 హెక్టార్ల భూమిలో 25.4 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని పేర్కొన్నారు. జీవో నెం.98 పై కంపెనీ వేసిన పిటిషన్ పై.. 15 అక్టోబర్,2019న కోర్టులో తుది విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాల్సిన అడ్వకేట్ జనరల్ కూడా పూర్తిగా కంపెనీ లాయర్ చెప్పిన ప్రతీదానికి తలఊపడంతో.. కోర్టు జీవో నెం.98ను కొట్టివేసింది. తీర్పు మీకు అనుకూలంగా వచ్చేందుకు కేటాయించిన మైనింగ్ భూములు పూర్తిగా ప్రైవేట్ భూములు అని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములకు వర్తించే శిక్షలు దీనికి వర్తించవని జీవో నెం.98 కొట్టివేయాలని కంపెనీ తరపున లాయర్ ప్రధానంగా వాదనలు వినిపించారు. పర్యావరణ అనుమతుల అప్లికేషన్ లో 25.4 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అంగీకరించి.. వాదనలలో ప్రభుత్వ భూమి లేదని ఎందుకు కోర్టును తప్పుదోవ పట్టించారు..? కోర్టు తీర్పు తర్వాత 12.12.2019న జీవో నెం.98ను కొట్టివేసి.. లీజులను రెన్యూవల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.109 విడుదల చేసింది."

"ఆశ్చర్యమేమిటంటే.. మైనింగ్ లీజులను రెన్యువల్ చేయడానికి 10 రోజుల ముందే ఇరిగేషన్ శాఖ మంత్రి 03.12.2019న కంపెనీకి 0.068 టీంఎంసీల నీటిని కేటాయించారు. పర్యావరణ అనుమతులలో 0.0368 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించాలనే నిబంధన ఉంటే.. దానికి రెట్టింపు నీటిని ఏవిధంగా సరస్వతి ఇండస్ట్రీస్ కు కేటాయించారు..? రైతులకు నీరు అందక ఇబ్బందులు పడుతుంటే.. మీ కంపెనీకి ఇష్టానుసారంగా నీటిని కేటాయిస్తారా..? ముఖ్యమంత్రి దగ్గర స్వామి భక్తి పోటీల్లో ముందుడాలని కారణంతో పందేల మంత్రి అనిల్ కుమార్ ఈ విధంగా నీటి కేటాయింపులు చేస్తారా..? అంటే చివరకు ముఖ్యమంత్రి ఒక నీటి దొంగలా కూడా మారారని అర్థమవుతోంది. పోలవరం ప్రాజెక్టులో ఒక రూపాయి అవినీతి జరగలేదని కేంద్రం క్లీన్ చిట్ ఇచ్చిన రోజునే.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నీటి బండారాన్ని బయటపెడుతున్నాం. దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ ఏం సమాధానం చెబుతారు..? నీటి కేటాయింపులను మొదటి ఐదేళ్లకు అని జీవోలో పేర్కొని.. తర్వాత జీవిత కాలానికి అని చెప్పి 15.05.2020న మరో జీవో నెం.16 విడుదల చేశారు. అంటే భవిష్యత్తులో కంపెనీ మూతపడితే నీరు అమ్ముకుని అయినా బ్రతికేద్దామనుకుంటున్నారా..?

ఇప్పటికే ఊరుకో ప్యాలెస్ కట్టుకున్న ముఖ్యమంత్రి.. ఇంకా ఎన్ని ప్యాలెస్ లు కట్టాలని ఈవిధంగా చేస్తున్నారు. సహజంగా జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తిలో పరివర్తన వస్తుంది.. కానీ మీలో ఎందుకు రావడం లేదు. వేమవరం, చెన్నాయపాలెంలలో సర్వే నెంబ్లర్లు మార్చడానికి.. 26.05.2020న ఒక జీవో నెం.28 ఇచ్చి, అలా కాదని 10 రోజుల్లోనే 08.06.2020 న మరో జీవో నెం.30 ఇచ్చారు. సర్వే నెంబర్లను మార్చే అధికారం మీకెక్కడిది..? వేటి ఆధారంగా జీవో నెంబర్లు మారుస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తుంటే.. ముఖ్యమంత్రి జీవోల పేరుతో రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారు. వైకాపా మాదిరిగా అసత్య ఆరోపణలతో కాకుండా.. సాక్షాధారాలను ప్రజల ముందు ఉంచుతున్నాం. 108 వాహనాల కుంభకోణంపై సమాధానం చెప్పలేక విజయసాయిరెడ్డి ముఖం చాటేసినట్లు.. అనిల్ కుమార్ కూడా కలుగులో దాక్కోకండి. 48 గంటల్లో టీడీపీ అడిగిన అన్ని ప్రశ్నలకు మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పండి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read