కరోనా సమయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇచ్చిన సహాయం గురించి చెప్పారు. 39.14 కోట్ల కేజీల బియ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ మూడు నెలల్లో పంపించామని చెప్పారు. దీని వల్ల 7.83 కోట్ల మంది లబ్ది పొందారని అన్నారు. 2.71 కోట్ల మంది లబ్దిదారులకు, 2.71 కోట్ల కేజీల కందిపప్పు, ఈ మూడు నెలల్లో ఇచ్చామని నిర్మలాసీతారామన్ అన్నారు. 500 రూపాయల చొప్పున, మూడు నెలలకు మహిళలకు ఇచ్చామని అన్నారు. జన్ ధన్ అకౌంటులు ఉన్నవారికి, డబ్బులు నేరుగా ఇచ్చామని అన్నారు. అలాగే భావన నిర్మాణ కార్మికులను కూడా కేంద్రం ఆదుకుందని, 196 కోట్లు ఇచ్చామని, 19 లక్షల మంది దీని వల్ల లబ్ది పొందారని అన్నారు. అలాగే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అడిగిన వెంటనే, స్రామిక్ రైళ్ళు 3 కేటాయించమని అన్నారు. రాష్ట్రం ఎన్ని కోరితే ఎన్ని ఇస్తాం అని అన్నారు. గుజారాత్ లో చిక్కుకున్న శ్రీకాకుళం వాసులని తీసుకు రావటానికి, మేము ఎంతో ప్రయత్నం చేసామని, కేంద్రం చేసిందిని గుర్తు చేసారు. ఇవి కాకుండా, నగదు కింద, రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఇచ్చామని అన్నారు.

కరోనా కారణంగా రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయని తలచి, అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా డబ్బులు ఇచ్చామని, ఒక్క కరోనాను ఎదుర్కోవటానికే, రూ.8025 కోట్లు కేంద్రం రాష్ట్రానికి, ఈ మూడు నెలలలో ఇచ్చిందని అన్నారు. రాష్ట్రం డబ్బులు లేక ఇబ్బంది పడుతుందని, కేంద్రం ఇంత పెద్ద ఎత్తున సహాయం చేస్తుందని, డబ్బులు, బియ్యం, పప్పులు, ట్రైన్ల కేటాయింపు చేసామని అన్నారు. అలాగే పీపీఈ కిట్లు, మాస్కులు, ఇలా ఏమి కావాలో అవి, నేను అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు ఫోనులు చేసి వాళ్లకు కావల్సింది ఇచ్చామని అన్నారు. అయితే ఈ సందర్భంగా, వైసీపీ పై ఆరోపణలు చెయ్యవద్దు అనుకున్నా అని, కాని ఒక విషయం చెప్పాలని అన్నారు. పీపీఏల విషయంలో, రాష్ట్రం అనుసరించిన విధానం వల్ల, అంతర్జాతీయంగా ఇబ్బంది వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు. ఇక చివరగా, అసలు బాంబు పేల్చారు నిర్మలా సీతారామన్. కేంద్ర ప్రభుత్వం, ఒక రేటుకి కరెంటు ఇస్తున్నామని చెప్పినా, రాష్ట్రం మాత్రం భారీగా ప్రజల నుంచి చార్జ్ చేస్తున్నారని, కేంద్రం యూనిట్ 2.70కి ఇస్తుంటే, రాష్ట్రం మాత్రం ప్రజల నుంచి రూ.9 యూనిట్ ధర తీసుకుంటుందని తెలుసుకుని, షాక్ అయ్యానని, ఈ కరోనా టైంలో ఇలా చెయ్యటం కరెక్ట్ కాదని, ప్రజలను ఇబ్బంది పెట్టద్దు అని కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read