అధికారంలోకి వచ్చిన తరువాత, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్రంలో అన్ని పంచాయతీ కార్యాలయాలకు, తమ సొంత పార్టీ రంగులు వేసుకున్న సంగతి తెలిసిందే. పంచాయతీ కార్యాలయాలు కాకుండా, మిగతా కొన్ని భవనాలకు కూడా వైసిపీ రంగులు వేసారు. అయితే దీని పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. పంచాయతీ కార్యాలయాలు అనేవి, ప్రజలు అందరూ వస్తారని, ఇదేమీ వైసిపీ ఆఫీస్ కాదని, చాలా మంది అభ్యంతరం చెప్పారు. అయితే, ఎన్ని విమర్శలు వచ్చినా, ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. దీంతో కొంత మంది కోర్టుకు వెళ్లారు. అయితే దీని పై హైకోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేస్తూ, పార్టీ రంగులు తీసేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే, హైకోర్టు నిర్ణయం పై, సుప్రీం కోర్టుకు వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే సుప్రీం కోర్టులో కూడా అక్షింతలు పడ్డాయి. మేము సుప్రీం కోర్టు బయట మా సీజీ ఫోటో పెట్టుకుంటే ఒప్పుకుంటారా ? లేకపోతే కేంద్ర సంస్థలు అన్నిటికీ కాషాయం వేస్తె ఒప్పుకుంటారా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది, కేసు కొట్టేసింది. అయితే హైకోర్టు, సుప్రీం కోర్టు చెప్పినా, రంగులు తియ్యకపోవటంతో, మళ్ళీ కోర్టుకు వెళ్ళారు.

అంతే కాకుండా, మూడు రంగులకు తోడుగా, ఇంకో రంగు వేసి, రంగులు మార్చేసాం అని మభ్య పెట్టారు. దీంతో కోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేస్తూ, కోర్ట్ ధిక్కరణ ప్రక్రియ ప్రారంభించాలని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, గడువు లోపు, రంగులు మార్చేస్తాం అని కోర్టుకు చెప్పింది. దీంతో ఇప్పుడు ఇక జగన్ ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. హైకోర్టు, సుప్రీం కోర్టు వరుస పెట్టి, మొట్టికాయలు వెయ్యటం, కోర్టు ధిక్కరణ ప్రారంభించటం, గడువు దగ్గర పడుతూ ఉండటంతో, కొత్త రంగులు పై, అన్ని జిల్లాలకు ఆదేశాలు ఇచ్చింది. ప్రతి పంచాయతీ కార్యాలయాలకు రంగులు మార్చేయాలని, మొత్తం బిల్డింగ్ మొత్తం తెల్ల రంగులు వెయ్యాలని ఆదేశించింది. అయితే ఇదే సమయంలో, జగన్ మోహన్ రెడ్డి ఫోటో మాత్రం, బయట ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. వీలు అయినంత త్వరగా, ఈ ప్రక్రియ రెండు మూడు రోజుల్లో పూర్తి చెయ్యాలని, ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇప్పటికే ఈ ప్రక్రియ కొన్ని చోట్ల ప్రారంభించారు. దీనికి 14వ ఆర్ధిక సంఘం ఇచ్చిన నిధులు ఖర్చు చెయ్యాలని ఆదేశించింది. మొత్తానికి, జగన్ తగ్గక తప్పలేదు. ఒక ప్రభుత్వ కార్యాలయానికి పార్టీ రంగులు వెయ్యటమే తప్పు అనుకుంటే, దాన్ని కోర్టులు చెప్పినా వినకుండా, చివరకు రంగులు మార్చాక తప్పలేదు. అయితే జగన్ ఫోటో పెట్టటం కూడా తప్పు అని, దీని పై సుప్రీం కోర్టు ఇప్పటికే చెప్పింది అని, అది కూడా తీసేయాలనే వాదన కూడా వస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read