తనకు రాష్ట్రంలో బద్రత లేదని, కేంద్ర ప్రభుత్వ బధ్రత కావాలి అంటూ, వైసిపీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు, గత కొంత కాలంగా, ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఈ సందర్భంగా, స్పీకర్ కు, కేంద్ర హోం శాఖకు కూడా ఈ విషయం పై, ఇప్పటికే ఫిర్యాదు చేసారు. తనకు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదని, కేంద్ర ప్రభుత్వ బలగాలతో సెక్యూరిటీ కావాలని కోరారు. అయితే ఇదే విషయం పై, ఆయన ఢిల్లీ హైకోర్టు కు వెళ్ళారు. తనకు బధ్రత కలిగించే విషయంలో, తగు చర్యలు తీసుకునే విధంగా, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని, ఢిల్లీ హైకోర్టు లో పిటీషన్ వేసారు. అయితే ఈ పిటీషన్ పై కేంద్ర ప్రభుత్వం తరుపు న్యాయవాది స్పందించారు. రఘురామ రాజు లేఖ అందిందని, ఐబి నివేదిక వచ్చిన తరువాత, తగు చర్యలు తీసుకుంటాం అంటూ, కేంద్రం తరుపు హామీ ఇచ్చారు.రెండు వారాల్లో తగు చర్యలు తీసుకోవాలని చెప్తూ, కేసుని ఆగష్టు 6కి వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. అయితే దీని పై రఘురామరాజు స్పందించారు. ఆయన విలేకరుల సమావేశం పెట్టి, ఆవేదన వ్యక్తం చేసారు. సొంత ప్రభుత్వం పైనే, ఫిర్యాదు చెయ్యటం బాధాకరం అని అన్నారు. గతంలో మా నాయకుడుకి, ఎపి పోలీసుల పై నమ్మకం లేదని, ఇప్పుడు ఆ పరిస్థితి తనకు వచ్చిందని అన్నారు.

ఏకంగా మంత్రి వెళ్లి తన పై ఫిర్యాదు చేస్తే, అది ప్రభుత్వం చేసినట్టే అని, అలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే బధ్రత పై నమ్మకం లేదని, వాళ్ళని నమ్మితే, గొర్రె కసాయివాడిని నమ్మినట్టే అని, అందుకే కేంద్ర బధ్రత కావాలాని కోరినట్టు చెప్పారు. ఇక రేపు రాష్ట్రపతి దగ్గరకు వెళ్తున్నానని, రేపు ఉదయం అపాయింట్మెంట్ ఇచ్చారని, ఆయనను కలిసి అన్నీ వివరిస్తానని, అలాగే అమరావతి విషయం పై కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఇప్పటికే 10 వేల కోట్లు ఖర్చు పెట్టిన అమరావతిని వదిలేసి, మళ్ళీ ఇంకో రాజధాని ఏమిటో అర్ధం కావటం లేదని అన్నారు. అమ్మఒడి లాంటి పధకాలకు డబ్బులు లేక వేరే వాటివి మళ్ళిస్తున్నారు, అలాంటి పరిస్థితిలో మళ్ళీ ఇంకో రాజధాని ఏమిటో అర్ధం కావటం లేదని అన్నారు. వైజాగ్ ప్రజలకు ఇప్పటికే ఒక సాంపుల్ చూపించారని, వాళ్ళు దానికే తట్టుకోలేక పోతున్నారని, ఇంకా రాజధాని వద్దు, ప్రశాంతంగా ఉండనివ్వండి అనే భావనలో ఉన్నారని అన్నారు. రాజధాని పై పునరాలోచించమని కోరుతున్నా.

Advertisements

Advertisements

Latest Articles

Most Read