ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూల్ అఫ్ లా ఉందా ? ఇప్పటికి హైకోర్టు నుంచి ఈ ప్రశ్న, మూడు సార్లకు పైగానే వచ్చింది. ఇప్పటికే మూడు సార్లు రాష్ట్ర డీజీపీ, హైకోర్టు ముందుకు వెళ్లి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. అలాగే, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కూడా హైకోర్టు ముందుకు వెళ్ళాల్సిన పరిస్థతి వచ్చింది. అయినా, ఇన్ని జరిగినా, ఎలాంటి మార్పు రావటం లేదు. అధికారులకు మళ్ళీ మళ్ళీ కోర్టు చేతిలో మొట్టికాయలు పడుతూనే ఉన్నాయి. తాజాగా, తూర్పు గోదావరి జిల్లాకు చెందినా, న్యాయవాది సుభాష్ చంద్రబోస్ ని అర్ధరాత్రి పూట వచ్చి, భయబ్రాంతులకు గురి చేసి, ఆయన్ను తీసుకు వెళ్ళటం పై, న్యాయవాది భార్య, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‍ దాఖలు చేసారు. నిన్న దీని పై విచారణ జరిపిన హైకోర్టు సీరియస్ అయ్యింది. రేపటి లోగా న్యాయవాది సుభాష్ చంద్రబోస్ ని మా ముందు హాజరు పరచాలని, అలాగే తూర్పు గోదావరి ఎస్పీ తమ ముందు హాజరు కావాలి అంటూ, హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైకోర్టు ఆదేశాలు ప్రకారం, ఈ రోజు సుభాష్ చంద్రబోస్ ని హైకోర్టు ముందు హాజరు పరిచారు, తూర్పు గోదావరి పోలీసులు. అంతే కాకుండా, తూర్పు గోదావరి ఎస్పీ కూడా కోర్టు ముందు హాజరు అయ్యారు.

తూర్పు గోదావరి ఎస్పీ నయీం అస్మి పై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఒక న్యాయవాదిని, అంత ఇదిగా, అర్ధరాత్రి అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. ఆయన ఏమైనా పారిపోయే వ్యక్తా, ఎటువంటి ఆధారాలు లేకుండా, అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం ఏముంది ? ఇలా అర్ధరాత్రి వెళ్లి అరెస్ట్ చెయ్యవచ్చు అని నిబంధనలు ఉన్నాయా అని కోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో రూల్ అఫ్ లా ఉందా అని కోర్టు ప్రశ్నించింది. మీరు ఇలా ఇష్టం వచ్చినట్టు చేస్తే, మేము తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. పోలీసులు ఉంది, ప్రజల కోసం అని గుర్తుంచుకోవాలని, రాజకీయ బాసులు కోసం కాదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీకు రాజకీయాల్లోకి వెళ్ళాలి అని ఉంటే, యూనిఫాం తీసి వెళ్ళండి, యూనిఫాం వేసుకుంటూ మాత్రం, ప్రజల కోసమే పని చెయ్యాలని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వాలని చెప్తూ, తదుపరి విచారణ వచ్చే మంగళవారనికి వాయిదా వేసింది హైకోర్టు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read