ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్, ఈ రోజు చాలా పెద్ద తప్పు చేసారని, ప్రాముఖ్య న్యాయవాది జంధ్యాల రవి శంకర్ అభిప్రాయ పడ్డారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం, రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో, గవర్నర్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించగా, గవర్నర్ మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించారు. హైకోర్టు ఆదేశాలు ప్రకారం, నిమ్మగడ్డను రీస్టోర్ చెయ్యకుండా, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్నే, ఈ విషయం పై నిర్ణయం తీసుకోవాల్సిందిగా గవర్నర్ కోరటం, తప్పు అని జంధ్యాల రవి శంకర్ అన్నారు. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లోని, పేరా 318లో, గవర్నర్ కు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను మళ్ళీ నియమించమని చెప్పారని అన్నారు. ఇప్పుడు మళ్ళీ గవర్నర్, ఈ విషయాన్ని ప్రభుత్వానికే నివేదించటం అంటే, 73వ అమెండ్మెంట్ ని, గవర్నర్ ఆఫీస్ పట్టించుకోలేదని అర్ధం అని అన్నారు. రాజ్యాంగం లోని, 73వ అమెండ్మెంట్ ప్రకారం, ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై ఎలాంటి కంట్రోల్ ఉండదని అన్నారు.

2011లో పార్లిమెంట్ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్సు కూడా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఉన్న ఇండిపెండెంట్ హక్కులు గురించి చెప్పిందని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాని, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు కానీ ఒకే హక్కులు ఉంటాయని, ఇప్పటికే అనేక సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నాయని రవిశంకర్ అన్నారు. ఆర్టికల్ 243 (కే) గురించి మాట్లాడితే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను నియమించే అధికారం గవర్నర్ కు ఉంటుందని అన్నారు. నిమ్మగడ్డ కేసు వ్యవహారం మొత్తం, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను నియమించే, తొలగించే విషయంలో, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదనే విషయం పై, కేసు నడుస్తుంటే, ఇప్పుడే గవర్నర్, రాజ్యాంగ పదవిలో ఉండి, మళ్ళీ అదే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయం పై చూడాలి అనటం తప్పని అన్నారు. హైకోర్ట్ జడ్జిమెంట్ లోని 318 వ పేరాని గవర్నర్ ఫాలో అవ్వలేదని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read