వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 గా ఉంటూ, జగన్ మోహన్ రెడ్డి , నేను ఒకటే, నేనే చెప్పినా, ఆయన చెప్పినా ఒకటే అనే స్థాయి నుంచి, విజయసాయి రెడ్డికి ఒక్కో మెట్టు తగ్గిస్తూ, అధికారాలు తగ్గిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించి, విజయసాయి రెడ్డికి అధికారాలు కత్తిరించిన సంగతి తెలిసిందే. తాడేపల్లి ఆఫీస్ బాధ్యతలు మొత్తం సజ్జల రామకృష్ణా రెడ్డికి ఇచ్చారు. విజయసాయి రెడ్డిని కేవలం, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు పరిమితం చేస్తూ, నిర్ణయం తీసుకున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న విజయసాయి రెడ్డి, ప్రస్తుతం, ఢిల్లీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేస్తున్నారు. గతంలో, ఢిల్లీలో వైసిపీ నేతలు,ఎ వారిని కలవాల్సి వచ్చినా, విజయసాయి రెడ్డితో కలిసి వెళ్ళాలి అనే ఆదేశాలు కూడా వచ్చాయని పేపర్లో చూసాం. అయితే, ఇప్పుడు ఢిల్లీలో కూడా విజయసాయి రెడ్డి పవర్ కట్ చేసే పనిలో జగన్ ఉన్నట్టు తెలుస్తుంది.
దీనికి కారణం లేకపోలేదు. వారం రోజుల క్రితం, మంత్రి బుగ్గన ఢిల్లీ వెళ్ళారు. ఆయనతో పాటు, రిటైర్డ్ అధికారి అజయ్ కల్లం రెడ్డి కూడా ఉన్నారు. వెళ్ళు వెళ్లి మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి, వినతి పత్రం సమర్పించి, రాష్ట్రానికి రావాల్సిన వివిధ నిధుల పై చర్చించారు. అయితే ఈ సమావేశానికి అజయ్ కల్లం రెడ్డిని తీసుకువెళ్లటం, ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనకు సియంఓలో అధికారులు కత్తిరించటంతో, ఆయన పని అయిపొయింది అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా, ఆయన ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు. అయితే ఈ రోజు ఒక ప్రముఖ వార్తా పత్రిక కధనం ప్రకారం, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, విజయసాయి రెడ్డిని తీసి, అజయ్ కల్లంను నియమిస్తారని ప్రచురిచింది. ఇదే జరిగితే విజయసాయికి ఉన్న, క్యాబినెట్ హోదా కూడా పోతుంది. మరి ఇది నిజంగా కార్యరూపం దాల్చుతుందా ? ఒక వేళ నిజమే అయితే, విజయసాయి రెడ్డికి, మరో పవర్ కట్టించినట్టే.