ఆంధ్రప్రదేశ్ లో క-రో-నా కేసులు, తమ రికార్డును తామే, ప్రతి రోజు బద్దల కొట్టుకుంటూ వెళ్తున్నాయి. నెల రోజుల క్రితం వరకు, రోజుకు 50 కేసులు వస్తేనే వామ్మో అనుకునే స్థాయి నుంచి, ఈ రోజు ఏకంగా 8 వేల కేసులకు చేరుకున్నాం. గడిచిన 24 గంటల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు కేసులు తక్కువగా, 8 వేల కేసులు వచ్చాయి. మొత్తం 7998 కేసులు, ఈ 24 గంటల్లో వచ్చాయి. నిన్న ఆరు వేల కేసులు వస్తేనే వామ్మో అనుకుంటే, ఈ రోజు 8 వేలు వచ్చాయి. దక్షణ భారత దేశంలోనే 24 గంటల్లో వచ్చిన కేసుల్లో, మన రాష్ట్రమే ఎక్కువ. దేశంలో అత్యధికంగా కేసులు వస్తున్న మహరాష్ట్రతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోటీ పడుతుంది. మిగతా రాష్ట్రాల్లో కేసులు అన్నీ, ఒకటి రెండు సిటీల్లో 90 శాతానికి పైగా వస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం, 13 జిల్లాల నుంచి, కేసులు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 72711 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల్లో దేశంలోనే 5వ స్థానంలో ఉంటే, ఆక్టివ్ కేసుల్లో నాలుగవ స్థానంలో ఉన్నాము.
ఇప్పటి వరకు 884 మంది మరణించారు. ఇది కూడా, చాలా ఆందోళన చెందాల్సిన అంశం. టెస్టింగులు ఎక్కువ చేస్తున్నాం, అందుకే ఎక్కువ వస్తున్నాయి అని చెప్తున్నా, ఇది ఎంత వరకు కరెక్ట్ కారణం అనేది ప్రభుత్వం చెప్పాలి. వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి కానీ, స్ప్రెడ్ అయిన తరువాత ఎక్కువ టెస్టులు చేస్తున్నాం అని ప్రభుత్వం చెప్తుంది. గత నాలుగు నెలలుగా ప్రభుత్వం ఇదే విషయం చెప్తుంది, మరి ఈ పాటికి, వైరస్ వ్యాప్తి తగ్గాలి కదా ? ఇక జిల్లాల వారీగా చూసుకుంటే, రోజుకి ఒక జిల్లా టాప్ లో ఉంటుంది. నిన్న విశాఖలో ఒక్క రోజులో వెయ్యి కేసులు దాటితే, ఈ రోజు అనంతరపుంలో 1016 కేసులు, తూర్పు గోదావరిలో 1391 కేసులు, గుంటూరులో 1184 కేసులు వచ్చాయి. మొత్తంగా, చుస్తే, తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 10 వేల కేసులు వచ్చాయి.