గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆత్మకూరులోని టిడిపి కార్యాలయంపై వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషను హైకోర్టు కొట్టివేసింది. ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ గురించి, పిల్ వేయడంలో, మరో రాజకీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ఆసక్తి ఏమిటని ఆ న్యాయస్థానం ప్రశ్నించింది ? ఇందులో ప్రజా ప్రయోజనం ఏముంది ? ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ గురించి పిల్ ఎందుకు అనే విధంగా, హైకోర్టు స్పందించింది. 2017లో ఇదే అంశం పై ఆళ్ల రామకృష్ణారెడ్డి, హైకోర్టులో పిటీషన్ వెయ్యగా, కోర్టు అప్పుడు తోసిపుచ్చింది. అయితే ఇప్పుడే అదే అంశంలో, అదే వ్యక్తీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వెయ్యటం పై, హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఇది వరకు తోసిపుచ్చిన అంశాన్ని, పిల్ రూపంలో రావాటం ఎందుకని, అసలు మీకు ఈ విషయంలో ఉన్న ఆసక్తి ఏమిటి అంటూ, హైకోర్టు ప్రశ్నించింది. ఏది ప్రజా ప్రయోజన వ్యాజ్యం, ఏది రాజకీయ వ్యాజ్యం అనేది కోర్టులకు తెలుసని, కోర్టులకు అన్నీ తెలుసు అనే విషయం గుర్తు పెట్టుకోవాలని వ్యాఖ్యానించింది.
అయితే అనూహ్యంగా ఈ సందర్భంగా, ప్రభుత్వానికి సంబందించిన న్యాయవాది వాదనలు చెప్పబోతూ ఉండగా, ఈ విషయం పై మీకు ఏమి సంబంధం, మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని కోర్టు ప్రశ్నించింది. వేసిన వ్యక్తి ప్రైవేటు వ్యక్తీ అంటే, ప్రభుత్వం తరుపు న్యాయవాది స్పందించటంతో, కోర్టు ఈ వ్యాఖ్యలు చేసిందని అనుకోవాలి. అయితే ఈ విషయం పై, ఇది వరకే హైకోర్టు తోసిపుచ్చిన నేపధ్యంలో, మళ్ళీ విచారణ అవసరం లేదని, పిటీషన్ కొట్టేసింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే, సుప్రీం కోర్టులో అపీల్ చేసుకోవచ్చని, హైకోర్టు ఆదేశించింది. వాగు పోరంబోకి స్థలంలోని, కొంత భాగంలో, తెలుగుదేశం కార్యాలయం ఉందని, దాన్ని కూల్చివేసి, ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని, ఆళ్ళ పిటీషన్ వేసారు. అయితే గతంలోనే ఈ అంశం పై హైకోర్టుకు వెళ్ళిన ఆళ్ళ, రిట్ పిటీషన్ వేసారు. అయితే అప్పట్లో హైకోర్టు తోసిపుచ్చింది. అయితే ఇప్పుడు, ఆ విషయం దాచి పెట్టి, పిల్ రూపంలో, ఇదే అంశం పై మళ్ళీ హైకోర్టుకు రావటంతో, హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.