ప్రభుత్వ కార్యాలయ తరలింపు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులు, సిఆర్డీఏ రద్దు బిల్లులు, కొత్త హైకోర్టు నిర్మాణం పై దాఖలైన పిటీషన్ల పై, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని ఎక్కడ ఉండాలి అన్నది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న అంశం అని, పిటీషన్ తరుపు న్యాయవాది తన పిటీషన్ లో పేర్కొన్నారు. పిటీషన్ పై కౌంటర్లు దాఖలు చెయ్యాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఆగష్టు 6కి వాయిదా వేసింది కోర్టు. మొత్తంగా, ఈ రోజు ఈ అంశాల పై 32 కేసులు కోర్టు ముందుకు వచ్చాయి. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో, ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్న అంశం పై మళ్ళీ బిల్లు తేవటం, అలాగే శాసనమండలిలో చైర్మెన్ సెలెక్ట్ కమిటీ నియమించమని చెప్పినా, సెలెక్ట్ కమిటీ నియమించకపోవటం పై, మండలి సెక్రటరీ మీద కూడా ఒక కేసు నమోదు అయ్యింది. అదే విధంగా, మరి కొన్ని పిటీషన్లు కూడా ఇందులో ఇంప్లీడ్ అయ్యాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read