రాజమండ్రిలో, ఒక దళిత మైనర్ బాలిక పై జరిగిన గ్యాంగ్ రేప్ విషయం, సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఒక్కసారిగా రాజమండ్రినే కాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మొత్తం ఉలిక్కి పడింది. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన దిశా చట్టం అమలులో ఉన్నా, ఒక మహిళా ముఖ్యమంత్రి హోం మంత్రిగా ఉన్నా, ఈ ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే, రాష్ట్రంలోనే మొదటి దిశా పోలీస్ స్టేషన్ మొదలు పెట్టిన రాజమండ్రిలోనే ఈ ఘటన జరగటం కాక, నాలుగు రోజులు సాముహిక అత్యాచారం చేసి, ఆమెను తీసుకొచ్చి, పోలీస్ స్టేషన్ ముందే పడేసి, పోలీసులకే ఛాలెంజ్ చేసారు అంటే, రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ సంచలన ఘటనను తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకుంది. జరిగిన విషయం మొత్తం పై నివేదిక ఇవ్వాలి అంటూ, చంద్రబాబు పార్టీ తరుపున ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి, వాస్తవ పరిస్థితి వివరమించమని కోరటం, రెండు రోజుల క్రితం ఆ కమిటీ ఆ బాలికను, కుటుంబ సభ్యులను, పోలీసులను కలిసి వివరాలు సేకరించింది.
జరిగిన విషయం మొత్తం చంద్రబాబుకు నివేదించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఉండగా చంద్రబాబు చెలించిపోయారు. తెలుగుదేశం పార్టీ తరుపున, మనం చెయ్యగల్గిన సహాయం చేద్దాం అంటూ, పార్టీ తరుపున ఆ బాలికకు, రెండు లక్షల ఆర్ధిక సహాయం చెయ్యటమే కాకుండా, ఆమెను పార్టీ దత్తతు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఎంత వరకు చదివితే అంత వరకు, ఏ చదువు అయితే ఆ చదువుకు అయ్యే ఖర్చు మొత్తం పార్టీ భరిస్తుందని చెప్పారు. చంద్రబాబు నిర్ణయాన్ని, పలువురు ప్రశంసిస్తూ, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు అంత చేస్తే, ప్రభుత్వం కూడా ఇంతకంటే ఎక్కువ ఆదుకోవాలని, ప్రభుత్వం కూడా ఆ బాలికకు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం తరుపున ఉద్యోగ హామీ కానీ, ఏదైనా భారీ ఆర్ధిక సహాయం కనీ, ఇవ్వాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం మరింత కఠినంగా ఉండాలని, కొత్త చట్టాలు సంగతి తరువాత, ఉన్న చట్టాలతోనే, కఠిన శిక్షలు వెయ్యవచ్చని, గుర్తు చేస్తున్నారు.