తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వారం రోజుల క్రిందట ప్రధానికి ఫోన్ ట్యాపింగ్ పై లేఖ రాస్తే, ఏపి డీజీపీ స్పందిస్తూ ఆధారాలు ఉంటే ఇవ్వండి, మేము ఆక్షన్ తీసుకుంటాం అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే దీని పై స్పందించిన చంద్రబాబు, ఆరోపణలే మీ మీద అయితే, మీకు ఎలా ఆధారాలు ఇస్తాం అంటూ రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిన్న చంద్రబాబు మరో లేఖ రాసారు. ఈ సారి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసారు. అయితే ఈ సారి లేఖ ఒక్కటే కాదు, ఆధారాలు ఫోటోలు రూపంలో కూడా జత చేసారు. మరి ప్రభుత్వం, ఈ ఆధారాలతో తన నిర్ణయం మార్చుకుంటుందా ? చంద్రబాబుని ఆధారాలు అడిగారు కాబట్టి, ఈ సారి ఆధారాలు ఇచ్చారు, మరి జరిగిన అవినీతి పై ప్రభుత్వం ఎంక్వయిరీ చేస్తుందా ? అని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, పేదలకు ఇళ్ళ పట్టాలు అనే కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం కట్టిన 8 లక్షల ఇల్లు ఇవ్వకుండా, ఈ ఇళ్ళ స్థలాలు ఇవ్వటం పై విమర్శలు వచ్చినా, ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. అయితే ఈ ఇళ్ళ స్థలాలు ఎక్కువగా ఉపయోగం లేని చోట్ల ఇస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా బాధితులు ముందుకు రావటంతో, వారికి ప్రతిపక్షాలు అండగా ఉండి ఆందోళన చేసాయి.

cbn 21082020 2

ఈ నేపధ్యంలోనే తూర్పు గోదావరి జిల్లాలో, ఆవ భూముల్లో ఇళ్ళ స్థలాలు ప్రభుత్వం కేటాయించింది. అవి వరద వస్తే మునిగిపోయే భూములు అని తెలుగుదేశం ఆరోపించింది. అలాగే అక్కడ 5 లక్షలు పలికే చోట, ఎకరం 45 లక్షలు కొన్నారని, తెలుగుదేశం ఆరోపించినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. మొత్తం 600 ఎకరాల ఆవ భూములు ఇళ్ళ స్థలాలుగా ఇచ్చారు. అయితే ఇక్కడ జరిగిన అవినీతి పై కోర్టులో కేసు నడుస్తుంది. ఇది ఇలా ఉండగానే, గోదావరికి వరదలు రావటంతో, తెలుగుదేశం పార్టీ ఆరోపించినట్టే ఆ భూములు వరదల్లో మునిగిపోయాయి. దాదాపుగా నడుము లోటు వరద వచ్చింది. దీంతో ఇవి పత్రికల్లో, చానల్స్ లో రావటం, తెలుగుదేశం నేతలు అక్కడకు వెళ్లి పరిశీలించి, జరిగిన విషయం మొత్తం చంద్రబాబుకు చెప్పటంతో, చంద్రబాబు నిన్న చీఫ్ సెక్రటరీకి ఉత్తరం రాసారు. మొత్తం విషయం చెప్తూ, అక్కడ భూములు ఇస్తే పేదలకు జరిగే ముప్పు, అధికార పార్టీ, అధికారులు కలిసి చేసిన అవినీతి చెప్తూ, రాష్ట్రంలో వివిధ చోట్ల ఇలాగే జరిగిన విషయాన్నీ ప్రస్తావిస్తూ, ఈ మొత్తం వ్యవహారం పై విచారణ జరపాలని చీఫ్ సెక్రటరీని కోరారు. అలాగే ఈ భూములు వరదల్లో మునిగిపోయిన ఆధారాలు కూడా జత పరిచారు. మరి చీఫ్ సెక్రటరీ గారు చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read