ఏ రాష్ట్రానికైనా, దేశానికైనా ఉండేది ఒకటే రాజధాని అని ఇప్పటి వరకు మనకు తెలుసు. ఏమైనా ప్రత్యెక పరిస్థతితులు ఉంటే తప్పితే, రెండో రాజధాని అనేది లేదు. అది కూడా అతి తక్కువ మందికి మాత్రమే ఉన్నాయి. ఇక మూడో రాజధాని అనే తుగ్లక్ నిర్ణయం సౌత్ ఆఫ్రికాలో ఉంది. వాళ్ళు కూడా మాది తుగ్లక్ నిర్ణయం అని గ్రహించి, ఒకటే రాజధాని కోసం, పార్లమెంట్ లో చర్చలు జరిపారు కూడా. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల విషయం వింటున్నాం. అయితే ఇది రాజకీయ ఎత్తుగడ అనేది అందరికీ తెలిసిందే. కర్నూల్ కు హైకోర్టు వెళ్ళేది రాష్ట్రము చేతిలో ఉండదు. ఇక అమరావతిలో అసెంబ్లీ పెట్టినా పెట్టకపోయినా ఒక్కటే. అమరావతి నుంచి వైజాగ్ వెళ్ళటానికి మాత్రమే, ఈ మూడు రాజధానుల ఎత్తుగడతో ఏపి ముందుకు వచ్చింది. అయితే ఈ మూడు రాజధానులతో, వచ్చే ఎన్నికల్లో మనం కూడా ఓట్లు సంపాదించుకోవచ్చు అనుకున్నారో ఏమో, తమిళనాడులోని అధికార అన్నాడీఏంకే పార్టీ నేతలు, మూడు రాజధానుల రాగం ఎత్తుకున్నారు. ఇప్పటికే ఉన్న చెన్నై రాజధానితో పాటు మరో రెండు రాజధానులు ఉంటే బాగుంటుంది అంటూ డిమాండ్ చేస్తున్నారు.

tn cm 21082020 2

చెన్నై మొదటి రాజధాని అయితే, రెండో రాజధాని మధురై ని, మూడు రాజధాని తిరుచ్చిని ప్రకటించాలని తమిళనాడు అధికార పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే మొన్నటి దాక, ఒకరిద్దరు చేసిన ఈ డిమాండ్, ఇప్పుడు ఎక్కువ మంది ప్రస్తావించే స్థాయికి వెళ్ళింది. అధికార పార్టీ కావటంతో, అన్నాడీఏంకే, మూడు రాజధానుల ప్రకటన చేసి, వచ్చే ఎన్నికలకు వెళ్తుంది అని అందరూ భావించారు. అయితే ఈ మూడు రాజధానుల రాగాలకు ఫుల్ స్టాప్ పెడుతూ, తమిళనాడు ముఖ్యమంత్రి స్పందించారు. ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అసలు మూడు రాజధానుల ప్రస్తావనే లేదని, మధురైను రెండో రాజధాని చెయ్యాలన్న వాదనలతో పస లేదని, ఇంకా మూడో రాజధాని ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటూ ఘాటుగా స్పందించారు. అవి పార్టీలోని వ్యక్తులు చేస్తున్న వ్యక్తిగత కామెంట్స్ అని, మంత్రులు ఇలా మాట్లాడవద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. రెవెన్యూ మంత్రి ఉదయ్ కుమార్, మంత్రి నటరాజన్ రెండో రాజధాని, మూడో రాజధాని ప్రస్తావన తేవటం, కాంగ్రెస్ కూడా ఇందుకు మద్దతు తెలపటంతో, అలెర్ట్ అయిన తమిళనాడు ముఖ్యమంత్రి, ఈ ఆలోచనలే లేదని తేల్చి చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read