ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పధకం ప్రాజెక్ట్ అనుమతుల పై పునర్విచారణకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంగీకరించింది. పర్యావరణ అనుమతులు అవసరం లేదు అంటూ, సంయుక్త కమిటీ ఇచ్చిన నివేదిక పై తమ పరిశీలనలో అభ్యంతరాలు తెలియ చేసేందుకు, కేసు పై తిరిగి విచారణ జరపాలని తెలంగాణా ప్రభుత్వం అభ్యంతరం దాఖలు చేసింది. దీని పై విచారణ జరిపిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సభ్యులు, జస్టిస్ రామకృష్ణన్, సబల్ దాస్ గుప్తాలతో కూడిన ధర్మాసనం, విచారణ చేపట్టేందుకు ఒప్పుకుంది. సీమ ప్రాజెక్ట్ ల పై పునర్విచారణకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సిద్ధం అయ్యింది. అయితే దీని పై ఆంధ్రప్రదేశ్ తరుపు లాయరు తీవ్ర అభ్యంతరం తెలియ చేసారు. కమిటీ నివేదిక పై పిటీషనర్ అభ్యంతరాలు, పరిశీలనలు చెప్పినప్పుడు, తెలంగాణా ప్రభుత్వానికి ఏమైందని ప్రశ్నించారు. ఇదంతా కుట్ర పూరితంగా చేస్తున్నారని ఆరోపించారు. పిటీషనర్, తెలంగాణా ప్రభుత్వం కుమ్మక్కు అయ్యింది అంటూ ఆరోపించారు. పిటీషనర్ లేవనెత్తిన అంశాలనే తెలంగాణా ప్రభుత్వం ప్రస్తావించిందని, పిటీషనర్ కు తెలంగాణా ప్రభుత్వం మద్దతు ఇస్తుందని చెప్పారు.
ఈ ప్రాజెక్ట్ ను ఆపటం కోసం, ఉద్దేస పూర్వకంగా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీం కోర్టులలో పిటీషన్లు దాఖలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది, వాదనల పై జోక్యం చేసుకున్న ట్రిబ్యునల్ తెలంగాణా తరుపున కుడా వాదనలు వింటామని చెప్పింది. లేకపోతె తమకు వాదనలకు అవకాసం ఇవ్వలేదు అంటూ, తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకు వెళ్తుందని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. దీని పై స్పందించిన పిటీషనర్ తరుపు న్యాయవాది, మళ్ళీ విచారణ జరిపే బదులు, తెలంగాణా ప్రభుత్వ వాదనలను, అభ్యంతరాలను రాతపూర్వకంగా స్వీకరించాలాని తెలిపారు. వాటిని పరిగణలోకి తీసుకుని తీర్పు ఇవ్వాలని కోరారు. అయితే, ఈ కేసులో ఈ నెల 28న తుది వాదనలు వింటామని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది. దాంతో పాటు, తదుపరి విచారణను ఆ తేదీకి వాయిదా వేసింది. ఇక మరో పక్క ఈ నెల 25 న జరగాల్సిన అపెక్స్ కమిటీ సమావేశం కూడా వాయిదా పడింది. మొత్తంగా, సీమ ప్రాజెక్టుల విషయంలో, ఎన్నో కబ్రులు చెప్పిన కేసీఆర్, గతంలో చంద్రబాబుకు అడ్డు పడినట్టే, ఇప్పుడు కూడా అడ్డు పడుతున్నారు. మరే కేసీఆర్ ని వెనకేసుకుని వస్తున్నా జగన్ గారికి ఇప్పటికైనా అర్ధం అయ్యిందో లేదో ?