అమరావతి విషయంలో జోక్యం చేసుకోండి, ఫోన్ ట్యా-పింగ్ లో జోక్యం చేసుకోండి అనే అభ్యర్ధనలు కాదు ఇది. మన దేశ ప్రతిష్టకు సంబందించిన విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీపీఏల వివాదం గురించి అందరికీ తెలిసిందే. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో, సోలార్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చాలా కంపనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని, సోలార్ ఎనర్జీ ఉత్పత్తి ప్రారంభించారు. దీంతో మన రాష్ట్రానికి తక్కువ రేటుకు విద్యుత్ ఉత్పత్తి చేసుకునే వీలు వచ్చింది. అయితే ప్రభుత్వం మారటంతో, జగన్ మోహన్ రెడ్డి పీపీఏ సమీక్ష చేస్తాను అంటూ, ఆ కంపెనీలకు పేమెంట్లు ఆపేసి, కొన్నిటికి ప్రొడక్షన్ కూడా ఆపేసారు. అయితే, ఇందులో కొన్ని విదేశీ కంపెనీలు కూడా ఉన్నాయి. దీంతో జపాన్ లాంటి దేశాలు, ఏపి పై కేంద్రానికి ఫిర్యాదు కూడా చేసాయి. దీంతో అప్పట్లోనే కేంద్రం ఈ విషయం పై జోక్యం చేసుకుంది. మీ తీరు వల్ల దేశ ప్రతిష్ట పోతుంది అని, పీపీఏల పై సమీక్షల విషయంలో వెనక్కు తగ్గాలని, కేంద్రం రాష్ట్రానికి వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే ఇదే సందర్భంలో, దాదాపుగా 40 కంపెనీలు పైగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై కోర్టుకు వెళ్ళాయి. దీంతో హైకోర్టులో ఈ విషయం పై విచారణ ప్రారంభం అయ్యింది. కొన్ని వాయిదాలు కూడా నడిచాయి. డిసెంబర్ లో ఇచ్చిన తీర్పులో, ఈ విషయం సెట్ అయ్యే వరకు, సోలార్ విద్యుత్ కు యూనిట్ రూ.2.44, విండ్ కు యూనిట్ రూ.2.43 చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.

అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 40 శాతం బకాయలు మాత్రమే తీర్చింది ఇదే విషయం పై మళ్ళీ కోర్టుకు వెళ్ళటానికి ప్రయత్నం చేసినా, లేట్ అవుతూ వస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో కరోనా వచ్చి పడటంతో, మొత్తం స్థంబించి పోయిన విషయం తెలిసిందే. కోర్టులు కూడా రోజు వారీ కార్యక్రమాలు వాయిదా వేసుకున్నాయి. కేవలం ముఖ్యమైన కేసులు మాత్రమే, వాదనలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో విద్యుత్ పీపీఏల కేసు మరుగున పడిపోయింది. ఈ పరిస్థితిలో, నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ అఫ్ ఇండియాతో పాటు వివిధ కంపెనీలు, కేంద్రం వైపు చూస్తున్నాయి. కోర్టులో విషయం లేట్ అవుతూ ఉండటంతో, కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్దించాయి. ప్రధాని పిలుపు మేరకు, ఆత్మనిర్భార్ భారత్ లో, ఇప్పుడున్న ఈ పరిస్థితిలో, పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, పీపీఏ ల విషయంలో ఆంధ్రప్రదేశ్ తో నెలకొన్న వివాదంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరాయి. మరో పక్క క్రిసిల్ రేటింగ్స్ ప్రకారం, ఏపి నిర్ణయంతో, ఈ సెక్టార్ లో, రూ21 వేల కోట్లు రిస్క్ లో పడ్డాయని తెలిపింది. ఈ సమస్యకు త్వరగా పరిష్కారం లభించాలని తెలిపింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read