అందప్రదేశ్ లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ రోజు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కధనంతో, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించటంతో, ఈ వ్యవహారాన్ని మాజీ జడ్జి శ్రవణ్ కుమార్, హైకోర్టులో పిల్ రూపంలో వేసారు. దీని పై ఇప్పటికే రెండు సార్లు , హైకోర్టులో వాదనలు జరిగాయి. విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల్లో కూడా హైకోర్టు వేసిన ప్రశ్నలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీని పై విచారణ జరిపితే మీకు వచ్చిన అభ్యంతరం ఏమిటి అంటూ, హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే ఫోన్ ట్యాపింగ్ అనేది అంత తేలికైన విషయం కాదని, సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి, ఒక న్యాయమూర్తులదే కాదు,, సామాన్య వ్యక్తీ ఫోన్ ట్యాపింగ్ జరిగినా కూడా అది సీరియస్ గా తీసుకునే అంశం అని హైకోర్టు రెండు రోజుల క్రిందట వ్యాఖ్యానించింది. ఇది ప్రైవసీ ఆక్ట్ కు, భావప్రకటనా స్వేచ్చ, ఫండమెంటల్ రైట్స్ కు కూడా ఇది వ్యతిరేకం అని హైకోర్టు పేర్కొంది. అయితే నిన్న జరిగిన విచారణలో, మెయిన్ పిటీషన్ కు అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసి, ఈ నెల 27 లోపు ఇవ్వమని కోర్టు వాయిదా వేసింది.
ఈ నేపధ్యంలోనే, ఈ రోజు ఈ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ రోజు హైకోర్టు మొత్తం 16 మందికి నోటీసులు జరీ చేసింది. ఇందులో పిటీషన్ లో శ్రవణ్ పేర్కొన్న ప్రతివాదులతో పాటుగా, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కూడా నోటీసులు ఇచ్చింది హైకోర్టు. అలాగే మొబైల్ ఆపరేటర్లకు కూడా నోటీసులు వెళ్ళాయి. నోటీసులు వెళ్ళిన వారిలో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్, బీఎస్ఎన్ఎల్, అలాగే టెలికాం రెగ్యులేటరీ అఫ్ ఇండియా చైర్మెన్ కు కూడా ఈ నోటీసులు జరీ చేసింది. దీంతో పాటు సిబిఐ విశాఖపట్నం ఎస్పీకి కూడా ఈ నోటీసులు వెళ్ళాయి. అలాగే కేంద్రంలో ఉన్న టెలికాం శాఖ ప్రినిసిపల్ సెక్రటరీకి, ఆంధ్రప్రదేశ్ డీజీపీకి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి, ఆంధ్రప్రదేశ్ ప్రినిసిపల్ సెక్రటరీకి, ఇలా మొత్తం ఎవరినైతే ప్రతివాదులగా చేర్చారో వారికి నోటీసులు వెళ్ళాయి. నాలుగు వారాల్లో వీరు అంతా కూడా, వ్యక్తిగతంగా కానీ, న్యాయవాది ద్వారా కానీ హాజరు అయ్యి, తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. దీంతో పాటు న్యాయవాది శ్రవణ్ పేర్కొన్న అంశాలు, ఆ నోటీసుల్లో తెలిపింది. అలాగే ఫోన్ ట్యాపింగ్ కు సంబందించిన కొన్ని సుప్రీం కోర్టు తీర్పులను కూడా ఆ నోటీసుల్లో ఉదహరించింది.