రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వివాదం తారా స్థాయిలో ఉంది. జాతీయ స్థాయిలో ఈ విషయం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ నేపధ్యంలో ఒకే రోజు, కొద్ది సమయాల వ్యవధిలో విజయసాయి రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ని కలవటం కొత్త చర్చకు దారి తీసింది. ముందుగా వార్తా ప్రసారాల్లో విజయసాయి రెడ్డి తో పాటుగా, ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డి కలిసి, గవర్నర్ ను కలిసారని ప్రసారాలు చేసాయి. అయితే ఇద్దరూ కొద్ది సమయం గ్యాప్ లో గవర్నర్ ను విడివిడిగా కలిసినట్టు చెప్తున్నారు. గవర్నర్ కార్యాలయం ట్విట్టర్ లో పోస్ట్ చేసు, విజయసాయి రెడ్డి గవర్నర్ ని కలిసారని ఒక ఫోటో, ఇంటెలిజెన్స్ చీఫ్ తో కలిసింది ఒక ఫోటో పెట్టారు. పది రోజుల క్రితమే కరోనా నయం అయి విజయసాయి రెడ్డి వచ్చారు. ఇంత తక్కువ సమయంలో బయటకు రావటమే కాక, గవర్నర్ ని కలిసారు అంటే ఎదో ముఖ్యమైన విషయం పైనే అనే చర్చ జరుగుతుంది. దీనికి తోడు ఇంటలిజెన్స్ చీఫ్ కూడా కలవటం ఆసక్తిని రేపింది.
ప్రభుత్వ పరంగా అధికారికంగా ఏమైనా చెప్పాలంటే ప్రభుత్వం తరుపున మంత్రులు వెళ్ళాలని, కానీ విజయసాయి రెడ్డి, అధికారులతో కలిసి ఎందుకు కలిసారు అంటూ తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. దీనికి సంబంధించి వర్ల రామయ్య ట్వీట్ చేసారు. పలు కేసుల్లో బెయిల్ పై ఉన్న విజయసాయి రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ తో కలిసి గవర్నర్ వద్దకు వెళ్ళటం, ఏమిటి అని ? ఎందుకు కలిసారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అటు విజయసాయి రెడ్డి కానీ, ఇటు గవర్నర్ కార్యాలయం కానీ చెప్తే కానీ, ఎందుకు కలిసారో తెలిసే పరిస్థితి లేదు. ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తూ ఉండటంతో, వీరి కలియిక ఆసక్తి రేపుతుంది. ఫోన్ ట్యాపింగ్ పై వస్తున్న ఆరోపణలకు బ్రీఫింగ్ ఇచ్చేందుకు ఇంటలిజెన్స్ చీఫ్ గవర్నర్ ని కలిసి ఉంటారని, అదే సందర్భంలో వచ్చిన విజయసాయి రెడ్డి, ఎందుకు కలిసారో తెలియాల్సి ఉందని, కొంత మంది వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. మరో పక్క ఫోన్ ట్యాపింగ్ పై, హైకోర్టు, ఈ రోజు సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.