ఆంధ్రప్రదేశ్ రాజకీయలను మరోసారి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చుట్టేస్తున్నాయి. నిన్న ఒక ప్రముఖ పత్రికలో, న్యాయమూర్తుల ఫోనులు ట్యాప్ అవుతున్నాయా ? అంటూ ఒక కధనం వచ్చి సంచలనం సృష్టించటం, దాని పై ప్రభుత్వం లీగల్ నోటీసులు ఇవ్వటం తెలిసిందే. ఈ సందర్భంగా, అధికార పార్టీ ఎంపీనే, తన ఫోన్ ట్యాప్ అవుతుంది అంటూ, సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు మాత్రమే కాదు, ఏకంగా కేంద్రాని హోం శాఖకు లేఖ రాసారు. ఫోన్ ట్యాపింగ్ నిజం అని తేలితే, ప్రభుత్వాలే కూలిపోతాయి అనటంలో సందేహం లేదు. గతంలో జరిగాయి కూడా. ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ ఎంపీ లేఖ రాసారు. హోం శాఖ సెక్రటరీ అజయ్ కుమార్ బల్లాకు, రఘురామరాజు లేఖ రాస్తూ, గత కొన్ని నెలలుగా తన ఫోన్ లో రకరకాల శబ్దాలు వినపడుతున్నాయని, నాకు తెలిసిన సమాచారం ప్రకారం, మా రాష్ట్ర ఇంటలిజెన్స్ తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్టు తెలిసిందని, ఇది రాజ్యంగ ఉల్లంఘన అని, ఆర్టికల్ 14, 19, 21 ప్రకారం, నేరం అని, ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

అలాగే గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు మీకు తెలుసని, తనకు ప్రాణ హాని ఉందని, కేంద్రం నుంచి వై క్యాటగిరీ బద్రత కూడా తెచ్చుకున్న విషయన్ని అయన లేఖలో తెలిపారు. ఇప్పటికీ తనకు కొంత మంది వివిధ రకాల నంబర్లు నుంచి ఫోనులు చేస్తున్నారని, ఈ సందర్భంలో స్టేట్ ఇంటలిజెన్స్ తన ఫోన్లు ట్యాప్ చేసి, తన మూమెంట్స్ తెలుసుకుంటూ ఉంటే తన బధ్రతకు ముప్పు అని అన్నారు. వివిధ దేశాల నంబర్లు నుంచి, ఫోనులు చేస్తున్నారని, ఒక వైఎస్ రెడ్డి అనే వ్యక్తీ తనను చంపేస్తా అని బెదిరిస్తున్నారని అన్నారు. తాను ఒక ఎంపీ అని, తన విధులకు ఇవన్నీ ఇబ్బంది కలిగిస్తాయని, మీరు ఈ విషయంలో కల్పించుకుని, తగు చర్యలు తీసుకోవాలని, కేంద్ర హోం శాఖను రఘురామరాజు కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read