గత వారం, విజయవాడ స్వర్ణా ప్యాలెస్ హోటల్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం గురించి తెలిసిందే. దాదాపుగా 10 మంది వరకు ఈ అగ్ని ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. విజయవాడ రమేష్ హాస్పిటల్ కు అనుసంధానంగా, ఈ కోవిడ్ కాలంలో, ఈ హోటల్ పని చేస్తుంది. రమేష్ హాస్పిటల్ లో కోరనా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిలో కొంత మందిని, ప్రభుత్వం అనుమతి తీసుకుని, స్వర్ణా ప్యాలెస్ హోటల్ లో కూడా పెట్టారు. అయితే ఘోర అగ్ని ప్రమాదం జరగటం అన్నీ జరిగిపోయాయి. ఏది ఏమైనా, ఇక్కడ ప్రమాదంలో హాస్పిటల్ బాధ్యతా, హోటల్ బాధ్యత ప్రప్రధమం, అందులే అనుమానమే లేదు. అలాగే అసలు ఇక్కడ అనుమతి ఇచ్చిన ప్రభుత్వానికి కూడా తప్పే అవుతుంది. అయితే ప్రభుత్వం పై నింద రాకుండా, అధికార పార్టీ నేతలు ఎదురు దాని ప్రారంభించారు. హాస్పిటల్, హోటల్ యజమానుల కులం బయటకు తీసి, కులం పేరుతొ టార్గెట్ చేసారు. అయితే తరువాత రెండు రోజుల నుంచి ఏమైందో కానీ, హోటల్ యాజమాన్యాన్ని వదిలేసారు.
కేవలం రమేష్ హాస్పిటల్ ని పట్టుకున్నారు. ఈ మొత్తం పరిణామాల పై డాక్టర్ రమేష్ కూడా స్పందించారు. విచారణకు సహకారం అందిస్తామని చెప్పినా, తమను వేదిస్తున్నారని, తన పేరు వెనకాల లేని కులాన్ని కూడా పెట్టి, అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. తాము 10 లక్షల హార్ట్ ఆపరేషన్స్ చేసామని, ప్రమాదం జారింది అని, దానికి బాధ్యత వహిస్తున్నామని, అయినా ఇలా వేధిస్తున్నారని అన్నారు. అయితే ఇప్పుడు హీరో రాం కూడా ఈ అంశం పై ట్విట్టర్ లో సంచలన ట్వీట్లు చేసారు. జగన్ మోహన్ రెడ్డి పై ఎవరో కుట్ర పన్నారని, ఆ కుట్రలో భాగంగా ఆయన్ను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఫైర్ నుంచి ఫీజ్ వైపు విషయన్ని మళ్ళించి, అందరినీ ఫూల్స్ ని చేస్తున్నారని అన్నారు. జగన్ ని తప్పుగా చూపించటానికి, ఆయనకు తెలియకుండా ఆయన మనుషులే కుట్ర పన్నారని అనిపిస్తుందని అన్నారు. రమేష్ హాస్పిటల్స్ కు, స్వర్ణా ప్యాలెస్ ఇచ్చే ముందు, ప్రభుత్వమే అక్కడ క్వారంటైన్ కేంద్రం నడిపింది అని, మరి అప్పుడు ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని బాధ్యులను చేసే వారని ప్రశ్నించారు. అక్కడ వసతి బిల్లింగ్ మొత్తం, స్వర్ణా ప్యాలెస్ చేసిందని, వాటి ఆధారాలు పోస్ట్ చేసారు.