విశాఖను రాజధానిగా ప్రకటించిన తర్వాత ఒక్క సారిగా ఇక్కడి భూమి ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఖాళీ భూములను కొనుగోలు చేసేందుకు ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బడా వ్యాపా రులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగంలోకి దిగారు. అదే ఆసమయంలో విశాఖలో ప్రభుత్వ, ప్రవేట్ భూములలో కూడా కబ్జాదారులు పాగా వేస్తున్నారు. కబ్జాదారుల పై ఉక్కు పాదం మోపుతామని చెప్పిన ప్రభుత్వ పెద్దల పేర్లే నేడు కబ్జా వ్యవహారాల్లో వినబడుతున్నాయి. తాజాగా ఇసుకతోటలో ఒక ప్రైవేట్ స్థలానికి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. రాయలసీమ నుంచి వచ్చామని చెప్పి ఆ స్థలంలో ఉన్న వాచ్ మెన్ పై దౌర్జన్యం చేసి తాళ్లతో కట్టేసి, ఆ స్థలం పై ఎవరైనా కన్నెత్తి చూస్తే చంపేస్తామంటూ బెదిరించిన సంఘటన హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో సుమారు 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ స్థలం వద్దకు వచ్చి హడావుడి చేశారు. తాము రాయలసీమ నుంచి వచ్చామని చెప్తూ దాడులకు తెగబడ్డారు. అక్కడ ఉన్న వాచ్ మెన్ పై దాడి చేశారు. ఎవరైనా ఈ స్థలం పై కన్నెత్తి చూస్తే ప్రాణాలు తీసేస్తాం అంటూ బెదిరించారు.

ఇసుకతోట బస్సు స్టాప్ వద్ద సుమారు 15 కోట్ల విలువైన 4 వేల గజాల ఓ ప్రవేట్ స్థలం ఉంది. ప్రస్తుతం అక్కడ 20 సంవత్సరాలకు లీజు తీసుకుని ఓ వ్యక్తి మార్బల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థలా నికి సంబంధించి కోర్టులో వ్యాజ్యాలు నడుసున్నాయి. ఇదివరకు ఈ స్థలాన్ని ఓ మహిళ మరొకరికి విక్రయించింది. రిజిస్ట్రేషన్ జరగక పోవడంతో ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. స్థలం కొనుక్కుని డబ్బు అప్పగించాం కాబట్టి ఆ స్థలం తమదే అని కొను గోలు దారుడు చెబుతుండగా, ఒప్పంద సమయంలో ధర ఫిక్స్ కాలేదని, రేటు పెరిగిన కారణంగా కొత్త రేటు ప్రకారం ధర ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని సదరు మహిళ చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ఇరువర్గాల మధ్య కొన్నేళ్లుగా వాగ్వాదం నడుస్తుంది. రాజకీయ నాయకులు వద్దకు ఈ వ్యవహారం వెళ్లినప్పటికి ఇరు వర్గాలు రాజీకి ఒప్పుకోలేదు. దీంతో పరిస్థితి యధాతథంగా మారింది. తాజాగా ఆదివారం నాడు వేకువజా మున గుర్తు తెలీని 20 మంది వ్యక్తులు ఈ స్థలం వద్దకు వచ్చి హల్ చల్ చేయడం తో మళ్ళీ ఈ స్థలానికి సంబంధించిన వాగ్వాదం వార్తల కెక్కింది. ఆ స్థలంలో ఉన్న వాచ్ మెన్ పై భౌతిక దాడి చేసి అతన్ని తాళ్లతో కట్టేశారు.

అతని సెల్ ఫోన్ లాగేసుకున్నారు. అక్కడ ఉన్న ల్యాప్ టాప్, కంప్యూటర్ లను తీసుకెళ్లారు. అంతే కాకుండా అక్కడున్న సీసీ కెమెరా లను పూర్తిగా ధ్వంసం చేశారు. రాత్రికి రాత్రే గదులు, ప్రహరీకి సున్నం కూడా వేశారు. ఆ స్థలం తమదే అంటూ హద్దు రాయి కూడా పెట్టారు. తమకు ప్రభుత్వ పెద్దల అండ ఉందని ఈ స్థలం తమదే అని ఎవరైనా ఈ స్థలం వైపు చూస్తే వారికి చావే గతని హెచ్చరించి వెళ్లిపోయారు. పోలీసులకు వాచ్ మెన్ ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలు వెల్లడించారు. అలాగే వచ్చిన 20మందిలో ఒకరి పేరు పాండా, మరొకరి పేరు గంగిరెడ్డి అని పిలుచుకున్నట్లు తన ఫిర్యా దులో చెప్పాడు. ఈ గొడవ నేపథ్యంలో నైట్ డ్యూటీ లో ఉన్న ఇద్దరు ఎస్సైలు అక్కడ కాసేపు ఉన్నట్లు తెలుస్తుంది. ఇసుకతోట జంక్షన్ వద్ద ఆదివారం తెల్లవారు జామున ఓ స్థలం వద్దకు వచ్చి 20 మంది హడావుడి చేసిన ఘటనపై విజయసాయిరెడ్డి స్పందించారు. నగర పోలీస్ కమిషనడ్ కి ఫోన్ చేసి ఈ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు

Advertisements

Advertisements

Latest Articles

Most Read