మూకుమ్మడిగా మూడు పార్టీల ఆడిన ముష్టి రాజకీయాలకి ముక్కుపచ్చలారని అమరావతి రాజధానికి దెబ్బ పడింది. ఎన్నో ఆకాంక్షలు, ఎన్నో ఆశలతో, తమ ప్రాణానికి సమానమైన భూమి, 2014లో రోడ్డున పడేసిన రాష్ట్రానికి, ఒక రాజధాని కావాలి అని అధికార పక్షం, ప్రతిపక్షం, అన్ని రాజకీయ పక్షాలు కలిసి, ఏకగ్రీవంగా అడిగితే, 33 వేల ఎకరాలు ఇచ్చారు. సాక్షాత్తు ప్రధాని వచ్చి శంకుస్థాపన చేసి, చెప్పిన మాటలకు మురిసి పోయారు. పునాదులు లేగిస్తే, ఎంతో సంతోషించారు. ఒక్క చాన్స్ ఒక్క చాన్స్ అంటే, చంద్రబాబు కంటే, గొప్పగా రాజధాని కడతారేమో అని అత్యాసతో, అమరావతిలో కూడా జగన్ పార్టీని గెలిపించారు. కనీ అదే వారి పాలిట ఉరి తాడు అయ్యింది. అమరావతి మూడు ముక్కలు అయ్యింది. బిల్లులు శాసనమండలిలో రిజెక్ట్ అయినా, కోర్టులో ఉన్నా, గవర్నర్ వద్దకు పంపించి, బిల్లులు ఈ రోజు ఆమోదించుకున్నారు. ప్రధాని శంకుస్థాపన చేసారు, బీజేపీ వచ్చి అమరావతి ఉద్యమానికి సంఘీభావం తెలిపింది కాబట్టి, బీజేపీ అడ్డుకుంటుంది అనే పిచ్చి ఆశతో ఉన్నారు.
కానీ హిందుత్వం అని చేపుకునే బీజేపీ, కనకదుర్గమ్మ కొలువై ఉన్న నెల మీద, మహిళలకు కన్నీరు మిగిల్చి, రెండు బిల్లులను గవర్నర్ ఆమోదించారు. అమరావతి నాశనం వెనుక వైసీపీ వెనుక, బీజేపీ, జనసేన ఉందనే విషయం స్పష్టం అయిపొయింది. తెలుగుదేశం పార్టీ పోరాడుతుంటే, కమ్మ, బినామీ అంటూ, బురద జల్లుతున్నారు. ఏది ఏమైనా అందరూ కలిసి అమరావతి రైతుల గొంతు కోశారు. పండుగ రోజున కావాలని, తనకు ఎదురు తిరిగిన రైతులను, మహిళలను ఏడిపించాలని, ఈ ప్రభుత్వానికి అనిపించిందేమో. అయినా గవర్నర్ నిర్ణయంతో, ఏమి అయిపోలేదు. ఇదే గవర్నర్, జగన్ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం, నిమ్మగడ్డను తొలగించారు. ఏమైంది ? ఈ రోజే ఆయనే మళ్ళీ నిమ్మగడ్డను నియమించ లేదా ? అమరావతి కూడా అంతే. కోర్టులో ఉన్న విషయం పై నిర్ణయం తీసుకునే హక్కు గవర్నర్ కు లేదు. మళ్ళీ తాను ఇచ్చిన నోటిఫికేషన్, ఆయనే వెనక్కు తీసుకునే పరిస్థితి కచ్చితంగా వస్తుంది.