గత కొంత కాలంగా, ఏపి, తెలంగాణా మధ్య, ఏమి లేని సమస్యను సృష్టించి, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అంటూ, పోతిరెడ్డిపాడు వెడల్పు చేస్తూ, హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీని పై , ఏపి ప్రభుత్వం టెండర్లు పిలవటంతో, తెలంగాణా రాష్ట్రం అభ్యంతరం చెప్పటంతో, దీని పై కీలక పరిణామం చోటు చేసుకుంది. టెండర్లు పిలవటం వెంటనే నిలిపి వేయాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కృష్ణా రివర్ మ్యానేజ్మెంట్ బోర్డు, లేఖ రాసింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో ముందుకు వెళ్ళద్దు అంటూ, ఆ లేఖలో స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్ట్ ఆపేయాలి అంటూ, ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించాలని, తెలంగాణా ప్రభుత్వం రాసిన లేఖను కూడా, కృష్ణా రివర్ మ్యానేజ్మెంట్ బోర్డు, జత చేసి పంపించింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా, ఈ ప్రాజెక్ట్ పై ముందుకు వెళ్ళద్దు అని, కృష్ణా రివర్ బోర్డు తెలిపింది. డీపీఆర్ లేకుండా, ప్రాజెక్ట్ నిర్మాణం ఎలా చేస్తారు అంటూ, కృష్ణా రివర్ మ్యానేజ్మెంట్ బోర్డు స్పష్టం చేసింది.
దీనికి సంబంధించి ఏపి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్ దాస్ కు, కృష్ణా రివర్ బోర్డు సభ్యడు, హరికేష్ మీనా లేఖ రాసారు. అలాగే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం, విభజన చట్టానికి విరుద్ధంగా ఉందని లేఖలో తెలిపారు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ నిర్మించాలి అంటే, అపెక్స్ కౌన్సిల్ లో అనుమతి తప్పనిసరి అని తెలిపింది. కృష్ణా బోర్డు అనుమతి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్ట్ కడితే, తెలంగాణాలోని నాలుగు జిల్లాలు ఏడాది అయిపోతాయని, దాన్ని ఆపేయాలని, కేసిఆర్ కేంద్రానికి లేఖ రాసారు. దీంతో కేసిఆర్ ఫిర్యాదుకు స్పందించి, ఏపికి ముందుకు వెళ్లొద్దు అని కేంద్రం చెప్పింది. అయితే ఇక్కడ, కేసిఆర్, జగన్ కు మంచి రిలేషన్ ఉంది. ఏపికి, ముఖ్యంగా రాయలసీమకు ఇబ్బందిగా మారిన కాళేశ్వరం ఓపెనింగ్ కు కూడా జగన్ వెళ్ళారు. మరి ఇప్పుడు కేసిఆర్ ఎందుకు అభ్యంతరం చెప్తున్నారో, జగన్ ఎందుకు కేసిఆర్ తో కలిసి, ఈ సమస్య సవ్యంగా సాగిపోయేలా ఎందుకు చూడలేదో మరి.