ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు మేరకు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పై, సిబిఐ విచారణ ముమ్మరం చేసింది. గత పదమూడు రోజులుగా సిబిఐ విచారణ ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే పులివెందులలో వైఎస్ వివేక ఇంటికి వెళ్లి, హత్య జరిగిన తీరు సీన్ రీ-కన్స్ ట్రక్షన్ చేసిన సిబిఐ, అక్కడ వాచ్మెన్ తో పాటుగా, డ్రైవర్ ఇతరులును ఇప్పటికే సిబిఐ విచారణ చేసింది. మరో పక్క కీలక ఆధారాలు, కూడా సిబిఐ రాబట్టింది. ఇక ఇప్పటి వరకు అందరికంటే, వైఎస్ వివేక కూతురు, వైఎస్ సునీతను విచారిస్తూ, ఆవిడ దగ్గర నుంచి, ఎవరెవరి మీద అనుమానం ఉంది, ఎందుకు అనుమానం అనే పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే రెండు రోజుల క్రిందట వైఎస్ సునీతను, ఏడు గంటల పాటు విచారణ చేసారు. ఆమె చెప్పిన ఆధారాలు ప్రకారం, అనుమానాలు ప్రకారం, నిన్న వైఎస్ కుటుంబ సన్నిహితుడు, అలాగే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన, శివశంకర్‌ రెడ్డిని నిన్న విచారణ చేసారు.

అయితే ఈ రోజు మళ్ళీ వైఎస్ సునీతను విచారణకు పిలివటం, ఆవడిను ఉదయం నుంచి విచారణ చెయ్యటం ఆసక్తి రేపుతుంది. అంతే కాకుండా, ఈ రోజు వైఎస్ సునీత వస్తూ, ఆమె చేతిలో ఒక నల్ల బ్యాగు తీసుకు రావటంతో, ఆమె ఏమి ఆధారాలు తీసుకు వచ్చారు అనే అంశం పై ఆసక్తికర చర్చ జరుగుతుంది. హత్య కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలతో, వైఎస్ సునీత వచ్చినట్టు తెలుస్తుంది. ఆమె ఏమి ఆధారాలు చెప్పారు ? ఎవరికీ సంబందించిన ఆధారాలు అనే విషయం చూడాలి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 15 మంది పై అనుమానం వ్యక్తం చేస్తూ, వైఎస్ సునీత హైకోర్టు లో అఫిడవిట్ వేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఇప్పటికే కొంత మందిని విచారణ చేసిన సిబిఐ , త్వరలోనే అతి కీలకమైన వ్యక్తులను విచారణ చేయ్యనుంది. ఇప్పటికే, రెండు సిట్ లు విచారణ చేసి, ఎవరు చంపారు అనేది తేల్చలేక పోయారు. ఇప్పటికైనా, సిబిఐ, అసలు చంపింది ఎవరు ? ఎందుకు చంపారు అనే వాస్తవాలు తెలుస్తాయో లేదో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read