ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్ధరాత్రి కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిన నిమ్మగడ్డ వ్యవహారంలో, రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డను రానివ్వకుండా చేసిన ప్రతి ప్రయత్నం ఫెయిల్ అవ్వటంతో, రాజ్యాంగానికి తలోగ్గలసిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు శుక్రవారం కావటం, నిమ్మగడ్డ వ్యవహరంలో వాయిదా ఉండటంతో, సుప్రీం కోర్టులో కూడా మూడు సార్లు ఎదురు దెబ్బలు తినటం, ఏకంగా చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా, మాకు ఏపిలో జరుగుతున్న ప్రతి విషయం తెలుసు అంటూ, ఘాటుగా స్పందించిన నేపధ్యంలో, రాష్ట్ర ప్రభుత్వానికి గత్యంతరం లేక, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని మళ్ళీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నియమిస్తూ, అర్దారాత్రి జీవో జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నియమిస్తూ, గవర్నర్ కూడా ఉత్తర్వులు ఇచ్చారు. అర్ధరాత్రి గవర్నర్ పేరిట నోటిఫికేషన్ జారీ అయ్యింది. హైకోర్టు ఉత్తర్వులు మేరకు, ఆయన్ను నియమిస్తున్నట్టు, ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అంతే కాదు గెజిట్ విడుదల చేయాలంటూ, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది కూడా ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీం కోర్టు తుది తీర్పునాకు లోబడేనని స్పష్టం చేసారు. కరోనా నేపధ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్, స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసారు. అయితే తమను సంప్రదించకుండా, ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారు అంటూ, నిమ్మగడ్డను కులం పేరుతో తిట్టారు, ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేలు దాకా. అయితే ఎన్నికల కమీషనర్ పార్టీలను అడిగి నిర్ణయం ఎందుకు తీసుకుంటారో వారే చెప్పాలి. ఇక తరువాత కరోన సాయాన్ని, వైసిపీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్ధుల చేత పంచి పెట్టటంతో, వారి పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు నిమ్మగడ్డ. ఇక ఇది సహించలేని ప్రభుత్వం, ఆయన్ను తప్పిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. తరువాత హైకోర్టుకు వెళ్ళటం, సుప్రీం కోర్టుకు వెళ్ళటం, ప్రతి చోట రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలటంతో, చివరకు నిమ్మగడ్డను నియమించక తప్పలేదు. ఇది రాజ్యంగ విజయం. ప్రజాస్వామ్య విజయం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read