ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం, ఎదో ఒక విధంగా వార్తల్లో వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఆయన పదవిలో లేరు, ఆయన్ను ప్రభుత్వం ఎప్పుడో పదవి నుంచి తొలగించింది. హైకోర్టు చెప్పినా ఆయన్ను పదవిలోకి రానివ్వటం లేదు. మాకు కోర్టు తీర్పు పై స్పందించటానికి, రెండు నెలలు సమయం ఉంటుంది అంటూ, నిమ్మగడ్డను రానివ్వటం లేదు. ఆయన నేను పదవిలోకి వస్తున్నా అని చెప్పినా, ఆ సర్కులర్ రద్దు చేసారు. అంటే, ఇప్పుడు రమేష్ కుమార్, ఒక సామాన్య మాజీ అధికారి. అంటే, ఇప్పుడు జగన్ గారి పక్కన ఉన్న అజయ్ కల్లం రెడ్డి, లాంటి మాజీ అధికారులు ఎలాగ ఉన్నారో, ఇప్పుడు రమేష్ కుమార్ కూడా అలాగే మాజీ అధికారి. తన పదవి కోసం, కోర్టుల్లో పోరాడుతున్నారు. అయితే ఈ తరుణంలోనే, హైకోర్టు చెప్పినా, సుప్రీం కోర్టు స్టే ఇవ్వకపోయినా, నిమ్మగడ్డకు పోస్టింగ్ ఇవ్వటం లేదు. ఆయన ఈ నేపధ్యంలోనే, కోర్టు ధిక్కరణ కేసు కూడా వేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ నేపధ్యంలోనే, వైసిపీ ఒక సిసి ఫూటేజ్ తో బయటకు వచ్చింది.
ఆ సీసీ టీవీ ఫూటేజ్ ప్రకారం, ఈ నెల 13న, రమేష్ కుమార్, హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో, బీజేపీ నేతలను కలిసారు. బీజేపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, అలాగే బీజేపీ నేత సుజనా చౌదరితో, కలిసినట్టు ఆ వీడియోలో ఉంది అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవిలో ఉండి, ఎవరినైనా కలిస్తే తప్పు కాని, పదవిలో లేనప్పుడు, ఎవరిని కలిసినా తప్పు ఉండదు. అయితే సహజంగానే, నిమ్మగడ్డ రమేష్ ని ఎలాగైనా పదవి నుంచి తప్పించాలని చూస్తున్న వైసిపీకి ఇది అందివచ్చిన అస్త్రం అయ్యింది. నిమ్మగడ్డ, బీజేపీ నేతలను కలవటం వెనుక కుట్ర కోణం ఉంది అంటూ, తమ అనుకూల మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ విషయం పై, ఇప్పటి వరకు, నిమ్మగడ్డ కాని, బీజేపీ నేతలు కాని వివరణ ఇవ్వలేదు. కామినేని కూడా నిమ్మగడ్డ తరుపున కోర్టులో కేసు వేసారు. కోర్టు ధిక్కరణ పిటీషన్ వేసే సమయంలో, వీళ్ళు కలుసుకున్నారా, లేక ఈ భేటీ వెనుక ఢిల్లీ పెద్దల హస్తం ఏమైనా ఉందా అనే సందేహాలు కూడా, విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం, ఇది ఏ మలుపు తిరుగుతుందో.