సరస్వతి పవర్ కంపెనీకి జీవితాకాలం నీటి కేటాయింపులు, అలాగే 50 ఏళ్ళు సున్నపురాయి గనులు ఇవ్వటం పై, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. సొంత కంపెనీలకు లబ్ది చేకూరుస్తూ, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని ఆరోపించారు. అయితే, దీని పై స్పందించిన ప్రభుత్వం, సరస్వతి పవర్ కు, ఇచ్చినవి అన్నీ నిబంధనలు ప్రకారమే ఇచ్చామని, దీంట్లో ఏమి లేదంటూ కౌంటర్ ఇచ్చారు. అయితే, దీని పై, ప్రభుత్వం, ఏకంగా చంద్రబాబుకి, అలాగే చంద్రబాబు వ్యాఖ్యలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి, ఈనాడుకి కూడా నోటీసులు జారీ చేసింది. నోటీసులు ఇవ్వటమే కాకుండా, చంద్రబాబు క్షమాపణ చెప్పాలని, లేకపోతే క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఫాలో అవుతామని హెచ్చరించింది. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు పై ఈ రోజు చంద్రబాబు స్పందించారు. ఈ రోజు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో జరిగిన ఆన్ లైన్ సమావేశంలో చంద్రబాబు స్పందించారు. తనకు నోటీసులు ఇచ్చిన విషయం ఫై ఘాటుగా బదులు ఇచ్చారు చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటే చూస్తూ కూర్చోం అని, నోటీసులు ఇస్తే భయపడిపోమని అన్నారు.

సరస్వతి పవర్ మీ సొంత కంపెనీ, నిజమా కాదా ? దీంట్లో ఏమైనా తప్పు ఉందా ? ఆ కంపెనీకి జీవిత కాలపు కేటాయింపులు ఇస్తాం, 50 ఏళ్ళకు మైనింగ్ లీజు ఇస్తాం అంటే చూస్తూ కూర్చోమంటారా ? గనులు, నీళ్ళు ఎలా కేటాయిస్తారు అని అడిగితే, సెక్రటరీ చేత తనకే నోటీసులు ఇస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. అవినీతి చేసిన వాళ్ళ పై చర్యలు ఉంటాయి కాని, ఇక్కడ మాత్రం, అవినీతి బయట పెట్టిన వారి పై చర్యలు ఉంటాయని, నోటీసులు ఇచ్చి వేధిస్తారని చంద్రబాబు అన్నారు. 108 కుంభకోణంలో కూడా ఇదే జరిగిందని చంద్రబాబు అన్నారు. అంబులెన్స్ ల కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థ విజయసాయి రెడ్డి అల్లుడి కంపెనీ అని, అన్ని వివరాలతో పట్టాభి బయట పడితే, ఆయన పైనే, పోలీసులను పంపించి వేధించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఒక్కటి కాదని, సాండ్, ల్యాండ్, వైన్, మైన్, ఇళ్ళ స్థలాలు, ఇలా ప్రతి దాంట్లో వేల కోట్లు దండుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read