ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో మారు హైకోర్టు మెట్లు ఎక్కారు. అందరూ ఊహించినట్టు గానే, గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగా, ఆయన రాష్ట్ర ప్రభుత్వం పై, హైకోర్టులో, కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు. హైకోర్టులో, కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు, నిమ్మగడ్డ తరపు న్యాయవాది అశ్విన్ కుమార్. హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు. తన విజ్ఞప్తులను సైతం పట్టించుకోవడం లేడని, అరిపిస్తూ, పిటీషన్ లో, తెలిపారు నిమ్మగడ్డ. గత కొంత కాలంగా ఈ అంశం పై వివాదం నడుస్తూ ఉంది. కరోనా కారణంగా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసారు. అయితే, దీని పై జగన్ భగ్గుమన్నారు. ఏకంగా సియం హోదాలో ఉంటూ, కులం పేరుతో నిమ్మగడ్డ పై విరుచుకుపడ్డారు. ఇక తరువాత, రమేష్ కుమార్ కు బెదిరింపులు రావటంతో, ఆయన తనకు కేంద్ర బలగాల భద్రత కావాలని, ఇక్కడ పదవిలో ఉన్న వాళ్ళ చరిత్ర, వీళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే భయం వేస్తుంది అంటూ, సుదీర్ఘ లేఖ రాసారు. ఈ లేఖ పై జగన్ ప్రభుత్వ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చంద్రబాబు రాసిన లేఖ అంటూ, ఎదురు దాడి చేసింది. అయితే తరువాత రెండు రోజులకే, కేంద్రం ఆయనకు భద్రత కల్పించింది.

అయితే కరోనా సమయంలో, చేస్తున్న సహాయంలో, పోటీలో ఉన్న వారు పాల్గుని, తమకే ఓటు వెయ్యాలని చెప్పటం, ప్రతిపక్షాలు అప్పటి ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చెయ్యటంతో, నిమ్మగడ్డ, ఈ విషయం పై, చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. అంతే, వెంటనే ప్రభుత్వం, మేము ఎన్నికల సంస్కరణలు తెస్తున్నాం అని ఒక ఆర్డినెన్స్ తెచ్చి, 77 ఏళ్ళ కనకరాజ్ ను తీసుకు వచ్చి, ఎన్నికల కమీషనర్ గా నియమించారు. అయితే, దీని పై నిమ్మగడ్డ కోర్టు కు వెళ్లారు. తనను తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పారు. హైకోర్టు కూడా నిమ్మగడ్డతో ఏకీభావిస్తూ, ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ కొట్టేసింది. దీంతో నిమ్మగడ్డ మళ్ళీ ఎన్నికల కమీషనర్ అయ్యారు. అయితే ప్రభుత్వం మాత్రం, ఇందుకు ఒప్పుకోలేదు. ఆయన నియామకం చెల్లదు అంటూ సుప్రీం కోర్టుకు వెళ్ళింది. సుప్రీం కోర్టు, హైకోర్టు తీర్పు పై స్టే ఇవ్వటానికి నిరాకరించింది. అయినా సరే, నిమగడ్డను ప్రభుత్వం ఒప్పుకోక పోవటంతో, కోర్టు ధిక్కరణ కింద ఆయన ఈ రోజు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. మరి దీని పై, హైకోర్టు ఎలా స్పందిస్తుందో, ఎలాంటి ఆదేశాలు జరీ చేస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read