బీజేపీ పార్టీ, దేశ వ్యాప్తంగా, వర్చ్యువల్ ర్యాలీలు నిర్వహిస్తుంది. ఈ రోజు రాయలసీమ జోన్ వర్చ్యువల్ ర్యాలీలో, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గున్నారు. ఈ సందర్భంగా, ఆయన జగన్ ప్రభుత్వం పై, ఘాటు విమర్శలు చేసారు. "ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఏదైతే మనమందరం కూడా, ఆ రోజు, తెలుగుదేశం పోవాలి, టిడిపి మోసం చేసింది, మనల్ని వెన్ను పోటు పొడించింది, నరేంద్ర మోడీని మోసం చేసింది అనే ఆలోచనతో, మొన్న ఎన్నికలు జరిగాయి. ఈ రోజు సంవత్సరం అయ్యింది, వైఎస్ఆర్సిపీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సిపీ హయంలో, అహంకారం వచ్చింది, అసత్యాలతో జగన్ మోహన్ రెడ్డి కాలం గడుపుతున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ రాజ్యం నడుస్తుంది. ఇది మంచిది కాదు. హోం శాఖ సహాయ మంత్రిగా, నాకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. పోలీసులు అక్రమ కేసులు పెట్టారని అంటున్నారు. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కష్టం, ఒక పార్టీలో చేరితే కష్టం, ఎలక్షన్ లో పాల్గుంటే కష్టం అనే ధోరణి మంచిది కాదు. ఇప్పుడు వికేంద్రీకృతమైన అవినీతిని మనం చూస్తున్నాం. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టా రాజ్యంగా చేస్తున్నారు. ఇది మారాల్సిన అవసరం ఉంది. "

"వైఎస్ఆర్సిపీ హయంలో, అవినీతి వికేంద్రీకరణ మాత్రం బాగా చేస్తుంది. మద్యం, ఇసుక మాఫియాలు ఎక్కడికక్కడ పురుడుపోసుకున్నాయి. వైఎస్ఆర్ పార్టీ జెండా నీడన, అనేక దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇది మార్చాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అండగా ఉంటుంది. విద్యా సంస్థలు దగ్గర నుంచి, రైల్వే జోన్ దగ్గర నుంచి, రాజధాని నిర్మాణానికి నిధులు దగ్గర నుంచి, అనేక విషయాల్లో కేంద్రం సహాయం చేస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం సహకారం అందిస్తుంది. కాని ఇటీవల కాలంలో, పోలవరం ప్రాజెక్ట్ నెమ్మదించింది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, చివరి పైసా వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది." అంటూ కిషన్ రెడ్డి చెప్పారు. 10 రోజుల క్రితం, రాం మాధావ్ కూడా, ఇదే విధంగా, జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి పై, మాట్లాడిన సంగతి తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read