రాష్ట్రంలో పిచ్చి పిచ్చి మద్యం బ్రాండులు అన్నీ అమ్ముతున్నారని, బూమ్ బూమ్, జాం జాం అనే బ్రాండులు వచ్చేసాయి అని ఉండవల్లి అన్నారు. పెద్ద కంపెనీలను ఎందుకు రానివ్వటం లేదు, ఈ పిచ్చి కంపెనీలు ఎందుకు వచ్చాయి అనే విషయం పై, వివరాలు సేకరిస్తున్నా అని, దీని పై త్వరలోనే పూర్తి వివరాలతో వస్తానని అన్నారు. అలాగే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, పగ తీర్చుకునే విధంగా ప్రవర్తించటం సబబు కాదని అన్నారు. ప్రత్యర్దులని నిర్ములించటానికి, కక్ష తీర్చుకోవటానికి కాదు, ప్రజలు మిమ్మల్ని గెలిపించింది అని అన్నారు. అలాగే నిమ్మగడ్డ పై, కులం విషయంలో జగన్ మోహన్ రెడ్డి, ప్రెస్ మీట్ పెట్టి మరీ తిట్టటం పై, ఉండవల్లి ఆక్షేపించారు. ఈ రోజు నిమ్మగడ్డ చేసిందే కరెక్ట్ అయ్యింది కదా, ఈ రోజు కరోనాతో అన్నీ ఆగిపోయాయి కదా అని ఉండవల్లి అన్నారు. ఆలాగే కోర్టుల పై వైసిపీ శ్రేణులు ఇష్టం వచ్చినట్టు చేస్తున్న వ్యాఖ్యల పై కూడా ఉండవల్లి స్పందించారు. జడ్జిలను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ ఉంటే, వారు ఎందుకు ఊరుకుంటారు అని ఉండవల్లి అన్నారు.
ప్రభుత్వాలు తప్పు చేస్తే కోర్టులు సరిదిద్దే బాధ్యత ఉందని అన్నారు. బూతులు తిట్టిన వారికి నోటీసులు ఇస్తే, మేము చూసుకుంటాం, ఇవన్నీ మాకు మాములే అంటూ, వైసిపీలో ఉన్న ఒక పెద్ద నేత చెప్తున్నారు అంటే, ఇంకా ఏమి చెప్పాలి ? అంటే దీని వెనుక మా పార్టీ ఉందని మీరే ఒప్పుకున్నారా అని ఉండవల్లి ప్రశ్నించారు. అధికారం శాశ్వతం అని జగన్ మోహన్ రెడ్డి అనుకుంటే, అంతకంటే పిచ్చి తనం లేదని ఉండవల్లి అన్నారు. అలాగే బడ్జెట్ పై ఉండవల్లి మాట్లాడుతూ, కేవలం జగన్ ఇచ్చిన హామీలకే, 84 వేల కోట్లు, ఏడాదికి అవుతుందని, ఇక జీతాలు, పెన్షన్లు అధికం అని, మరి ఈ డబ్బులు ఎలా తెస్తారని ఉండవల్లి ప్రశ్నించారు ? అలాగే పార్టీ మారిన వాళ్ళు అందరూ తనతోనే ఉంటారని జగన్ అనుకుంటున్నారేమో, మొన్న ఆ పార్టీలో ఎలా మాట్లాడారో, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నారుగా, ఎవరూ శాశ్వతం కాదని ఉండవల్లి అన్నారు.