గత కొన్ని రోజులుగా, రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, జరుగుతున్నా అరాచకాల పై అధికార పార్టీ ఎంపీనే, ప్రభుత్వం పై విరుచుకు పడటం సంచలనంగా మారింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణమరాజు, రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని విషయాల పై ప్రభుత్వాన్ని నిందిస్తూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో, రఘురామ కృష్ణం రాజు, జగన్ పై విమర్శలు చెయ్యటం పై, వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజు ఫైర్ అయ్యారు. జగన్ తనని పట్టించుకోకుండా, పక్క చూపు చూస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చెయ్యటం కరెక్ట్ కాదని, జగన్ చూడబట్టే, 20 రోజుల్లో ఎంపీ అవ్వటమే కాదు, ఏకంగా పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పదవి కూడా దక్కింది అంటూ, రఘు రామ కృష్ణం రాజు పై ఎదురు దాడి చేసారు. పార్టీలోకి ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, దానికి రఘురామకృష్ణం రాజు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని అన్నారు. రఘురామ కృష్ణం రాజు చెప్తున్నట్టు, ఇక్కడ కోటరీలు లేవని, జగన్ కు అందరూ సమానమే అని అన్నారు. అయితే ఇన్నాళ్ళు ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుతూ వచ్చిన రఘురామ కృష్ణం రాజు, తన పై వ్యక్తిగత దాడి చెయ్యటం పై, సొంత పార్టీ పైనే ఫైర్ అయ్యారు. ఏకంగా పార్టీ పైనే తీవ్ర ఆరోపణలు చేసారు.
"తాను ఎవరినీ టికెట్ అడగలేదు, నన్ను రావాలి రావాలి అంటే పార్టీలోకి వచ్చాను, టికెట్ ఇచ్చారు. నేను సీటు అడిగానో, నన్ను బ్రతిమలాడటానికి వచ్చారో, వారికి తెలుసు అని అన్నారు. అంతకు ముందు కూడా అడిగితె ఛీ కొట్టాను. కాని తరువాత కొన్ని పరిణామాలతో పార్టీ మారాను. వాళ్ళు వచ్చి రాష్ట్రం అంతా వైసిపీ వచ్చినా, మీరు ఇక్కడ లేకపోతె మేము గెలిచాం, ఎమ్మెల్యేలకు కూడా మీరు ఎంపీగా పోటీ చేస్తే కలిసి వస్తుంది అని అడిగారు. నా మొఖం చూసి కొంత మంది ఎమ్మేల్యేలు గెలిచారు. నేను జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచానని, వీళ్ళు అంటున్నారు. నాకు పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పదవి ఎవరిచ్చారో కూడా ఆయనకు తెలుసు. మా పార్టీ నుంచి ఒక స్టాండింగ్ కమిటీకి విజయసాయి రెడ్డి గారీ పదవి ఇచ్చారు. కాని మోడీ గారు నా పని తీరు నచ్చి, మా పార్టీ కోటా అయిపోయానా, నాకు ఈ పదవి ఇచ్చారు అని అన్నారు. ఇసుక పై, ఇళ్ళ పట్టాల పై జరిగిన అవినీతి పై తాను ఎలా పోరాటం చేస్తున్నానో అందరికీ తెలుసు అని అన్నారు.
అందరి లాగా, ప్రజల మీద పడి తాను డబ్బులు సంపాదించలేదని అన్నారు. అటువంటి సొమ్ముతో, ఎదో చేస్తున్నట్టు ఫోటోలు దిగి, బిల్డ్ అప్ ఇవ్వటం లేదని అన్నారు. జగన్ ని కలిసి కొన్ని విషయాలు చెప్దామని అనుకుని, జగన్ ని టైం అడిగాను, కాని జగన్ నాకు టైం ఇవ్వలేదని అన్నారు. ఏది ఏమైనా, ప్రసాదరాజుతో ఎవరు మాట్లాడించారో తనకు తెలుసు అని, ప్రసాదరాజు మంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని రఘురామకృష్ణంరాజు అన్నారు. వచ్చే మంత్రి వర్గ విస్తరణలో, మంత్రి పదవి ఖరారు చేసుకోవాటానికి, ప్రసాద రాజు, తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మ పార్టీలో ఒక పధ్ధతి ఉందని, బీసి నేత పై దాడి చెయ్యాలంటే, బీసి నేతతో విమర్శలు చేపిస్తారు, ఇప్పుడు నా పై ప్రసాద రాజు ని దించారని అన్నారు. అయితే ఇక్కడ రఘురామ కృష్ణం రాజు, తనకు సీటు వచ్చిన విధానం చెప్పటం పై, ఏకంగా హైకమాండ్ పైనే వ్యాఖ్యలు చెయ్యటం సంచలనంగా మారింది.