తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ నిన్న శాసనమండలిలో జరిగిన విషయం పై, ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. "మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదించడానికి తెదేపా ఇబ్బంది పెట్టిందని మంత్రులు ఆరోపించడం పూర్తిగా వాస్తవ విరుద్ధం. మంగళవారం మండలిలో జరిగిన సంఘటనల వీడియో పుటేజీని బయటకు విడుదల చేస్తే మంత్రుల దాడి వ్యవహారం బట్టబయలవుతుంది. గతంలో చైర్మన్ , నిన్న డిప్యూటీ చైర్మన్ లపై మంత్రులు ఒత్తిడికి గురి చేశారన్నది నిజం. తెదేపా సభ్యులు దీపక్ రెడ్డి, మంతెన సత్యనారాయణ రాజులను మంత్రులు బజారులో మాట్లాడుకునే బూతులు మాట్లాడారు. మంత్రుల మాటలు, ప్రవర్తన అసహ్యకరంగా ఉంది. సభ్యసమాజం తలవంచుకునేలా మంత్రుల ప్రవర్తన మండలి చరిత్రలో ఏనాడూ చూసి ఉండరు. రాజధాని వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులు సెలక్ట్ కమిటీ వద్ద ఉన్నాయి. రాజధాని వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులను రాష్ట్రంలోని అన్ని పార్టీలు,ప్రజలు ,మేథావులు వ్యతిరేకిస్తున్నారు. రూల్ 90 ప్రకారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించాలని యనమల,డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంలు రెండు గంటలపాటు ప్రాధేయపడినా, మంత్రులు వినలేదు. పిల్లి సుభాష్ చంద్ర బోస్ మాత్రం రూల్ 94 ను ప్రస్తావిస్తూ రాజధాని వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులను ప్రవేశ పెట్టడానికి తీవ్రంగా యత్నించారు."

"దాంతో ద్రవ్య వినిమయ బిల్లు చర్చకు రాకుండా మండలి ఆమోదం పొందకుండా నిలిచిపోయు రాజ్యాంగ సంక్షోభం రావడానికి మంత్రులే కారణం. సభలో వ్యతిరేకంగా ప్రవర్తించి తెదేపా సభ్యులు సహకరించలేదని మంత్రులు బయట మాట్లాడటం, ఆరోపించడం ప్రజలను,ఉద్యోగులను తప్పుదారి పట్టించడమే. ఆర్ధిక మంత్రి బుగ్గన ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెట్టడానికి ప్రయత్నిస్తే ఇతర మంత్రులు అడ్డుకొని బయట తెదేపాపై ఆరోపణలు చేయడం దారుణం. వైసీపీ సభా నాయకుడు రూల్ 94 ప్రవేశ పెట్టడంపై లోకేష్ న్యాయ సలహా, తెదేపా పెద్దల సూచనలకు వాట్స్ ఆప్ మెసేజ్లో సమాచారం కోసం ప్రయత్నిస్తుంటే మంత్రులు వెల్లంపల్లి,కన్నబాబులు తెదేపా సభ్యుల వైపు దూసుకు వచ్చారు. లోకేష్ లక్ష్యంగా దాడికి సిద్ధమయ్యారు. స్వయంగా దేవాదాయ మంత్రి వెల్లంపల్లి లోకేష్ పై దాడికి వచ్చారు. ఈసందర్భంలో లోకేష్ కు రక్షణగా నిలబడి మంత్రులను నిలవరించడానికి జరిగిన ప్రయత్నంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది, తోపులాట జరిగింది. "

"మండలిలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితులపై ప్రజలకు అవగాహన రావడానికి, వాస్తవం తెలియడానికి వీడియో పుటేజీ లను బహిర్గతం చేయడం తప్పని సరి. మంత్రులు లోకేష్ వైపు వచ్చారో, తెదేపా సభ్యులు మంత్రుల వైపు వెళ్ళారో కూడా తెలుస్తుంది. సభలో మంత్రులు వాడిన భాష దురదృష్టకరం. మంత్రులు తిట్టడంలో విచక్షణ కోల్పోయారు. మంత్రులు బూతులు మాట్లాడటం సభ్యత కాదు. వైసీపీ పెద్దల వద్ద మార్కులు కొట్టేయాలని, గొప్ప వారని పేరు సంపాదించడానికి ప్రయత్నించారు. యనమల దొడ్డిదారిన వచ్చారని మాట్లాడే ముందు వైకాపా సభ్యులైన పిల్లి సుభాష్ చంద్ర బోస్ ,ఉమారెడ్డి ,మోపిదేవి లు దొడ్డిదోవన వచ్చినట్లేనా?సమాదానమివ్వాలి. మండలిలో మంగళవారం జరిగిన ఘర్షణపై పూర్తిస్థాయి వీడియో పుటేజీని బయటపెట్టాలి. మంత్రులు , తెదేపా సభ్యుల మధ్య ఎందుకు తోపులాట జరిగిందో , ఎవరు దూషణలకు పాల్పడ్డారో స్పష్టమవుతుంది. దూషించిన, అభ్యంతరకరంగా ప్రవర్తించిన వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ చైర్మన్ ను డిమాండ్ చేస్తున్నాం" అని బీద రవిచంద్ర యాదవ్ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read