ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని మళ్ళీ నియమిస్తూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై, రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే సుప్రీం కోర్టుకు వెళ్ళటం, అక్కడ హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాల పై స్టే ఇవ్వాలని కోరాటం, అయితే సుప్రీం కోర్ట్ మాత్రం, నిమ్మగడ్డ నియామకం పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పై స్టే ఇవ్వటం కుదరదు అని చెప్పిన విషయం తెలిసిందే. అదే సందర్భంలో కేసులో ఉన్న ప్రతివాదులు అందరికీ సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు జారీ చేసిన వారిలో, రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కూడా ఉన్నారు. అయితే ఈ సందర్భంలో, సమాధానం ఇవ్వాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం, మరో పిటీషన్ సుప్రీం కోర్టులో దాఖలు చెయ్యటం అందరినీ ఆశ్చర్య పరిచింది. వ్యూహాత్మికంగా ఇలా చేసారా, లేదా ఈ పిటీషన్ వెయ్యటం వెనుక ప్లాన్ ఏమిటి అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే, సుప్రీం కోర్ట్ లో పిటీషన్ వేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని మళ్ళీ నియమిస్తూ ఇచ్చిన ఆదేశాల పై స్టే ఇవ్వాలి అంటూ, మరో పిటీషన్ సుప్రీం కోర్టు లో దాఖలు చేసింది.
ఈ కేసు పై ఈ రోజు సుప్రీం కోర్టులో, వాదనలు జరిగాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం పై, ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అయితే, గతంలో రాష్ట్ర ప్రభుత్వ పిటీషన్ లో చెప్పినట్టే, ఈ రోజు ఎన్నికల కమిషన్ వేసిన పిటీషన్ లో కూడా, సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు. హైకోర్టు ఉత్తర్వుల పై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. గతంలో కేసులతో కలిపి విచారణ జరుపుతామని స్పష్టం చేసిన కోర్టు, ఈ పిటీషన్ లో ఉన్న ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అయితే ముఖ్యంగా ఈ పిటీషన్ లో, రాష్ట్ర ఎన్నికల సంఘం వాదనలు వినిపిస్తూ, హైకోర్టు తీర్పులో స్పష్టత లేదని పేర్కొంది. అయినా సరే, ఈ వాదనల పై సుప్రీం కోర్ట్, పెద్దగా మొగ్గు చూపలేదు, ఇప్పటికిప్పుడు దీని పై స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇప్పటికే ఈ కేసు పై వాదనలు జరిగాయని, అందులో కలిపి ఇది కూడా విచారణ చేస్తాం అని చెప్పటంతో, మొన్న రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటీషన్ కాని, ఈ రోజు ఎన్నికల సంఘం ద్వారా కాని, అనుకున్న ఫలితం దక్కలేదు.