మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేసారు. "జగన్ ఏడాది పాలనలో పూర్తిగా వైఫల్యం చెంది రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేశారు. జగన్ నియంతలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే వారిని పిచ్చోళ్లను చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తే.. హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. కొంతమంది టీడీపీ నాయకులను హత్య చేయడానికి కొన్ని టీంలను ఏర్పాటు చేశారని సమాచారం వస్తోంది. మాకు అనేక బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. జూలై 22 లోపు చంపుతాం అంటున్నారు. పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. రెండు రోజుల క్రితం కూడా రిజిస్టర్ పోస్టులో కంప్లైంట్ ఇచ్చాం. ఏది జరిగినా మొదటి బాధ్యత జగన్ దే. టీడీపీ నేతలను రాబోయే రోజుల్లో హత్య చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఇష్టారీతిన ధూషిస్తున్నారు. ఇవేమీ పోలీసులకు పట్టడం లేదు. తిరుగులేని ప్రజాభిమానంతో అధికారంలోకి వచ్చిన ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు మహ్మద్ సుహార్తో ఏమయ్యారో చరిత్ర చూడాలి. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు మార్కోస్, ఉగాండా మాజీ అధ్యక్షుడు ఈడీ అమీన్ ఏమయ్యారో తెలుసుకోవాలి. నియంతలకే నియంత హిట్లర్ తనను తాను కాల్చుకుని చనిపోయాడు. తిరుగులేని ప్రజామోదం ఉందని, ఏమైనా చేస్తామంటే, లోపాల్ని ఎత్తిచూపితే హత్య చేయిస్తామని, తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడతామంటే కుదరదు ఎర్రన్నాయుడు గారిది మచ్చ లేని కుటుంబం. తప్పుచేస్తే చర్యలు తీసుకోవచ్చు.
కక్షపూరితంగా ప్రతిపక్ష పార్టీ నేతల జీవితాలతో ఆడుకుంటున్నారు. అవినీతి పునాదుల మీద పుట్టింది వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ. 11 కేసుల్లో 16 నెలలు జైల్లో ఉండి, తాత్కాలిక బెయిల్ పై బయటకు వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈఎస్ఐ మందుల స్కాంపై గతంలోనే అచ్చెన్నాయుడు స్పష్టమైన వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని అచ్చెన్నాయుడు స్పష్టమైన ప్రకటన చేశారు. అచ్చెన్నాయుడు గారి లేఖకు సంబంధించి పరిశీలించమని చెప్పిన టెలిహెల్త్ సర్వీస్, దానికి సంబంధించిన వ్యవహారంలో విజిలెన్స్ రిపోర్ట్ లో 7.80 కోట్లు అని ఉంది. ఎక్కడా అచ్చెన్నాయుడు గారి పేరు లేదు. బాధ్యత గల మంత్రులు రూ. 975 కోట్ల కుంభకోణం జరిగిందని ఇష్జారాజ్యంగా మాట్లాడుతున్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా నిజాలు మాట్లాడటం లేదు. విజిలెన్స్ రిపోర్ట్ లో ఏముందో ప్రజలముందు పెడుతున్నాం. అనెక్సర్ లో ఏయే ఇష్యూస్, ఏయే అధికారి ఇచ్చారో చెప్పారు. ఇందులో మొత్తం 9 అంశాలు ఉన్నాయి. ఫ్యాబ్రికేటెడ్ కొటేషన్స్ ను డైరెక్టర్స్ బి.రవికుమార్, సీకే రమేష్ కుమార్, డాక్టర్ జి.విజయ్ కుమార్.. పర్చేజ్ ఆఫ్ డ్రగ్స్ విషయంలో డైరెక్టర్ బి.రవికుమార్, సీకే రమేష్ కుమార్, డాక్టర్ జి.విజయ్ కుమార్, ఇతరలు, పర్చేజ్ ఆఫ్ ల్యాబ్ కిట్స్ విషయంలో బి.రవికుమార్, సీకే రమేష్ కుమార్, డాక్టర్ జి.విజయ్ కుమార్, ఎంకేపీ చక్రవర్తి (సీనియర్ అసిస్టెంట్) అని విజిలెన్స్ రిపోర్ట్ లో ఉంది. ఇందులో ఎక్కడా అచ్చెన్నాయుడు గారి పేరు లేదు. వైసీపీ నేతలు మాత్రం ఇష్టారాజ్యగా మాట్లాడుతున్నారు.
మంత్రి పర్చేచ్ చేయడానికి అసలు అవకాశమే లేదు. మంత్రికి, కొనుగోళ్లకు అసలు సంబంధం లేదు. జీవో నెం.51 ఇదే చెబుతోంది. 7.80 కోట్లలో కూడా టెలీ హెల్త్ మెడిసిన్ కు ఇచ్చింది 4 కోట్లు మాత్రమే. 4 కోట్లు ఇంకా పేమెంట్ ఇవ్వలేదు. రికవరీ చేయాలనుకుంటే టెలీ హెల్త్ వారిని లోపల వేస్తే.. మిగతా నగదు కూడా వెనక్కి వచ్చేస్తాయి. టీడీపీ ప్రభుత్వానికి ఏ సంబంధం లేకపోయినా, కేంద్ర ప్రభుత్వం అంశమైనా.. వైసీపీ మధ్యలో దూరి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. రూల్స్ కు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఏసీబీ అధికారులతో కూడా తప్పుడు ప్రకటనలు ఇప్పిస్తున్నారు. తప్పుడు కేసులు పెడితే అధికారులు కూడా ఇరుక్కుంటారు. గతంలో జగన్ మాట విన్న ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య, ఎల్వీ సుబ్రమణ్యం, రాజగోపాల్ ఏమయ్యారో అందరం చూశాం. కేంద్రం ఇచ్చిన పర్చేజ్ మాన్యువల్ ప్రకారం అధికారులదే బాధ్యత. తెలంగాణలో సంబంధిత మంత్రిని అరెస్ట్ చేయలేదు. ఈఎస్ఐకి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది. ప్రజాప్రతినిధుల వద్ద నుంచి అనేక రిప్రజెంటేషన్లు వస్తాయి. అది ఎవరైనా చేస్తారు. దీనిని పట్టుకుని తప్పుడు కేసులు పెట్టి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. జగన్ పై కేసులు ఉన్నాయి కాబట్టి మిగతావారిపైనా బురద జల్లాలని చూస్తున్నారు. కొంతమంది టీడీపీ నేతలను హత్య చేయాలని చూస్తున్నారు. మా ప్రాణాలకు హాని జరిగితే జగన్ ప్రభుత్వానిది, పోలీసులదే బాధ్యత అని హెచ్చరిస్తున్నాం. వ్యవస్థలను స్వప్రయోజనాల కోసం వినియోగించుకోవడం సరికాదు. టీడీపీ హయాంలో 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పి.. చివరకు 6 కోట్లకు పడిపోయింది. దాంట్లో కూడా 4 కోట్లు ఇంకా పేమెంట్ చేయలేదు. జరిగిన నష్టం 4 కోట్లే. మంత్రులు పిచ్చి ప్రేలాపనలు మానాలని హెచ్చరిస్తున్నాం."