ఇప్పటికే కోర్టుల్లో 70కు పైగా మొట్టికాయలతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరువు పోగుట్టుకుంది. అయితే వీటి నుంచి పాఠాలు మార్చుకుని, ముందుకు వెళ్ళాల్సిన ప్రభుత్వం, కోర్టులతో డీ అంటే డీ అంటుంది. ఇప్పటికే అమరావతిని మూడు ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ సమావేశాల్లో, సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టారు. అక్కడ ఈ రెండు బిల్లులు పాస్ అయ్యాయి. తరువాత శాసనమండలిలో కూడా ఈ బిల్లులు ప్రవేశపెట్టినా, అక్కడ బ్రేక్ పడటం, ఈ బిల్లు సెలెక్ట్ కమిటీ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే మండలిలో చైర్మెన్ చెప్పినా, సెలెక్ట్ కమిటీ వెయ్యకుండా, ప్రభుత్వం అడ్డుపడింది. అయితే ఇదే సందర్భంలో, అమరావతి రైతులు, అమరావతి మార్పు విషయం పై హైకోర్టులో కేసు వేసారు. ఈ సందర్బంగా, ప్రభుత్వం సమాధానం ఇస్తూ, ఈ ప్రక్రియ అంతా ఇంకా శాసనమండలిలోనే ఉందని, సెలెక్ట్ కమిటీ దగ్గర ఆగింది అంటూ, కోర్టుకు చెప్పింది. మొన్న నెల రోజుల క్రితం కూడా, శాసన వ్యవస్థలో ప్రక్రియ పూర్తి అయ్యే వరకు, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. అయితే ఈ రోజు ప్రభుత్వం, కోర్టుకు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ప్రభుత్వం చేసిన పనితో అందరూ అవాక్కయ్యారు.

ఈ రోజు సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను, శాసనసభలో మళ్ళీ ప్రవేశ పెట్టారు. చర్చ ఏమి జరగకుండానే ఆమోదించుకున్నారు. ఒక బిల్లు బుగ్గన ప్రవేశ పెట్టగా, మరో బిల్లు బొత్సా ప్రవేశ పెట్టారు. అయితే, ప్రభుత్వం చేసిన ఈ చర్య, కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది అంటూ, పలువురు వాపోతున్నారు. ఇప్పటికే రెండు బిల్లులు, మండలి చైర్మెన్, సెలెక్ట్ కమిటీకి రెఫెర్ చేసారని, ఇప్పటికే ఈ రెండు బిల్లులు, గవర్నర్ దగ్గర, అలాగే హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయని, ఇప్పుడు మళ్ళీ ఆ బిల్లులు ప్రవేశ పెట్టుకుని, మళ్ళీ ఆమోదించుకోవటం, చట్ట విరుద్ధం అని, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం స్పీకర్ కూడా ఉండటం, విచారకరం అని వాపోతున్నారు. ఇది ఎలాగూ చెల్లదు అని తెలిసి, కోర్టుల్లో ఎదురు దెబ్బ తగులుతుంది అని తెలిసి కూడా, ప్రభుత్వం ఇలా చేస్తుంది అంటే, కోర్టు లతో డీ కొనే విధంగా, ఎదో ప్లాన్ చేసారని, అర్ధం అవుతుంది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read