గత కొన్ని రోజులుగా, వైసీపీలోని సీనియర్లలో ముసలం పుట్టిన సంగతి తెలిసిందే. వరుస పెట్టి, బహిరంగంగా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. జగన్ పై డైరెక్ట్ గా అటాక్ చెయ్యకపోయినా, ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామంతో ప్రభుత్వం ఇబ్బందుల్లోకి వెళ్ళింది. ఈ వార్తల నుంచి మళ్ళించటానికి, టిడిపి నేతల పై అరెస్ట్ వార్తలు ముందుకు తెచ్చారు. అయితే, ఈ అరెస్ట్ ల పై కూడా సొంత పార్టీ పై నే విమర్శలు చేసారు రఘురామ కృష్ణం రాజు. దీంతో రఘురామ కృష్ణం రాజుకి వ్యతిరేకంగా, ప్రసాదరాజు ని రంగంలోకి దించింది, వైసిపీ అధిష్టానం. దీంతో రఘురామ కృష్ణం రాజు నిన్న మరింతగా రెచ్చిపోయారు. సామాజికవర్గాల వారీగా మా కులంలో చిచ్చు పెట్టకండి, అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ పరిణామాల పై జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయినట్టు చెప్తున్నారు. రఘరామ కృష్ణం రాజుకి షోకాజ్ నోటీసు ఇవ్వాలని, సరైన సమాధానం రాకపోతే, ఆయన్ను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చెయ్యాలని, జగన్ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే రఘురామకృష్ణం రాజు ఈ విషయం పై ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాల్సి ఉంది.

ఆయన ఈ చర్య పై ఎలా రియాక్ట్ అవుతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. సహజంగా జగన్ ఇలాంటివి తట్టుకోలేరు అని, ఇన్నాళ్ళు ఆయన్ను వదిలేసారు అంటేనే, జగన్ ఎందుకు వెనకడగు వేస్తున్నారు అని చర్చ జరుగుతుంది. నిన్న ఒక వీడియో విడుదల చేసిన రఘు రామ కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. "మా పార్టీలో విచిత్రమైన సిద్ధాంతం ఉంది. ఎవర్నైనా విమర్శ చేపించాలి అంటే, అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే చేత మాట్లాడిస్తారు. పవన్ కళ్యాణ్ అయితే కాపుల మీద, బీసీలు అయితే, బీసీల చేత తిట్టిస్తారు. అలాగే, నా మీద ప్రసాదరాజు చేత ఈ రోజు విమర్శలు చేయించారు. జగన్ దయతో ఎంపీ అయ్యానని, పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌ను అయ్యానని అంటున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం, నా ఇమేజ్ తో ఇక్కడ గెలిచారు, జగన్ మొఖం పెట్టుకుని కాదు. ఈ పార్టీలోకి వస్తాను అని కాని, సీటు ఇవ్వాలని కానీ అడగలా, రావాలని వైకాపా నేతలు కాళ్లా వేళ్లా బతిమిలాడితేనే నేను పార్టీలోకి వచ్చా. నేను కాబట్టే నరసాపురంలో నెగ్గా, నా ఇమేజ్ వల్ల ఎమ్మెల్యేలు గెలిచారు. జగన్ చుట్టూతా ఉన్నోళ్ళు, కుల పిచ్చతో ఉన్న వారే. పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నతమైన పదవులన్నీ, పేరు చివర ఒకే తోక తగిలించుకున్న, ఆ ఒక్క సామాజిక వర్గానికి చెందిన వారికే దక్కాయి. దయచేసి మా కులాన్ని ఈ కులాల రొంపిలోకి లాగొద్దు. మీరు రాజ్యాన్ని ఏలుతున్నారు, ఏలుకోండి కాని, మా చిన్న కులంలో చిచ్చు పెట్టొద్దు." అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read