ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, 40 ఏళ్ళు రాజకీయంలో ఉన్నా, ఏ నాడు తన కులం గురించి ప్రస్తావన తేలేదు. ఆయన ప్రజల ముందుకు కానీ, మీడియా ముందుకు కానీ వచ్చే సమయంలో కూడా, తన కులం వారిని దూరం పెట్టి, వేరే కులాల వారికి ప్రాధాన్యత ఇచ్చే వారు. ఎంతో మంది ప్రత్యర్ధులు, చంద్రబాబుతో రాజకీయం చేసినా, ఏ నాడు చంద్రబాబుని కులం పేరుతొ టార్గెట్ చెయ్యలేదు. చివరకు అందరి కంటే బద్ధ శత్రువు అయిన రాజశేఖర్ రెడ్డి కూడా, ఎప్పుడూ కుల రాజకీయం చెయ్యలేదు. దీన్ని బట్టే, చంద్రబాబు సామాజిక న్యాయం పాటించారో, తన కులానికి ప్రాధాన్యత ఇచ్చే వారో అర్ధం అవుతుంది. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి, చంద్రబాబుని, కులంతో కలిపి టార్గెట్ చేసారు. అమరావతి నిర్మాణం జరుగుతున్న సమయంలో, అది పతాక స్థాయికి చేరింది. అమరావతిలో 75 శాతం మంది బడుగు బలహీనవర్గాల వారు ఉంటే, కమ్మ వారి కంటే, రెడ్డి వారి జనాభానే అమరావతిలో ఎక్కువ. అయినా చంద్రబాబు కులం కోసం అమరావతిని తెచ్చారు అంటూ ఆరోపణలు చేసారు.

ఇప్పటికీ అవే ఆరోపణలు చేస్తున్నారు. దీంతో, ఎప్పుడూ కులం గురించి మాట్లాడని చంద్రబాబు, మొదటి సారి విసుగు చెంది, కుల ప్రస్తావన తెచ్చారు. చంద్రబాబు ఈ రోజు అమరావతి విషయం పై మీడియా సమావేశం పెట్టారు "నా స్వార్థం కోసం ఏం చేయలేదు. నా బంధువులు, నాకులం వారు ఆనాడు హైదరాబాద్ లో లేరు. ఆరోజు అభివృద్ధి చేశాను కాబట్టి ఓ తృప్తి ఉంది. అమరావతి నిర్మాణాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాను. భావితరాల భవిష్యత్తుకు వీచికగా భావించాను. ఈ విషయాన్ని ప్రజలంతా గుర్తుంచుకోవాలి. రాజకీయంగా నన్ను ఎదుర్కొ లేక కుల ముద్ర వేశారు. అమరావతి నా కోసమో, నా కుటుంబం కోసమో, నా కులం కోసమో కాదు. నాకు కులం లేదు. మొట్టమొదటి సారిగా జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు కులం అంటగట్టారు. నాకు కులం అంటదు. సామాజిక న్యాయం కోసం ఎప్పుడూ పోరాడుతా. పాటు పడతా. అవసరమైతే ఈ విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. "

"హైదరాబాద్ నిర్మాణ సమయంలో కనిపించని కులం అమరావతిలోనే ఎందుకు కనిపించింది. రాజకీయంగా నన్ను ఎదుర్కొనే ధైర్యం లేక కుల ముద్ర వేశారు. కులం అన్నారు. నా కులం ఉందని కుప్పంలో 35 ఏళ్లుగా గెలుస్తున్నానా...? అమరావతిలో ఒకే కులం ఉందా.? నేను 35 ఏళ్లుగా కుప్పంలో గెలుస్తున్నా. అక్కడ ఏ కులం ఉంది.? కులం గురించి మాట్లాడే వారి నోటికి హద్దులేదా.? ఇష్టానుసారంగా మాట్లాడుతారా.? ఎప్పుడూ లేని విషయాల గురించి మాట్లాడడం సరికాదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సామాజిక న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. నేను చిన్నప్పటి నుండి కులాలకు అతీతంగా పని చేశాను. అమరావతిలో ఒక కులం అంటున్నవారికి చెబుతున్నా. ఆ చుట్టుపక్కలున్న నియోజకవర్గాలన్నీ ఎస్సీ నియోజకవర్గాలేనని తెలియదా.? బీసీలు, ముస్లింలు అధిక ప్రాంతానికి కుల ప్రస్థావన తీసుకురావడం దుర్మార్గం. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు.. పాలన చేతకాక కులం పేరుతో నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. అవినీతి అన్నారు. ఏం సాధించారు.? ఏం నిరూపించగలిగారు.? ఎదురు దాడి మానుకుని.. వాస్తవాలను గమనించి అమరావతిని కొనసాగించండి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడండి. భావితరాల భవిష్యత్తును అంధకారం చేయొద్దని విన్నవిస్తున్నా. " అని చంద్రబాబు అన్నారు....

Advertisements

Advertisements

Latest Articles

Most Read