ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు దూసుకుపోతున్నాయి. మహరాష్ట్ర, తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రాలు తరువాత, చిన్న రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది. ప్రతి రోజు దాదాపుగా 10 వేలు కేసులు కంటే ఎక్కువ వస్తున్నాయి. గత 24 గంటల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 10,080 కేసులు వచ్చాయి. అలాగే రాష్ట్రంలో 97 మరణాలు సంభవించాయి. కరోనా కేసుల్లోనే కాదు, మరణాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 లక్షలు కేసులు దాటి, 2,17,040 కేసులు ఈ రోజుతో వచ్చాయి. అలాగే మరణాలు కూడా 2 వేలకు చేరువలో ఉన్నాయి. మొత్తం, 1939 మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో అత్యధికంగా కర్నూల్ జిల్లాలో 1353 కేసులు వచ్చాయి. తరువాత తూర్పు గోదావరి జిల్లాలో 1310 కేసులు వచ్చాయి. అన్ని జిల్లాల కంటే తక్కువగా కృష్ణా జిల్లా 391 కేసులతో ఉంది. ఇక మరణాలు విషయానికి వస్తే, గడిచిన 24 గంటల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 14 మరణాలు సంభవించాయి.
ఇక మొత్తంగా కేసులు తీసుకుంటే, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కేసులు స్ప్రెడ్ అయ్యాయి. అత్యధింగా తూర్పు గోదావరి జిల్లాలో 30160 కేసులు ఉన్నాయి. ఇక తరువాత స్థానంలో కర్నూల్ జిల్లాలో 26032 కేసులు వచ్చాయి. తరువాత స్థానంలో అనంతపురంలో 23249 కేసులతో మూడవ స్థానంలో ఉంది. ఇక మరణాలు చూసుకుంటే, కర్నూల్ 238 మంరాలు, తూర్పు గోదావరి 218 కేసులతో, గుంటూరు జిల్లా 211 కేసులతో మూడవ స్థానంలో ఉంది. ఇక అలాగే రికవరీ రేటులో కూడా రాష్ట్రము, మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తక్కువగానే ఉంది. మొత్తానికి కరోనా కట్టడిలో, ప్రభుత్వం విఫలం అయ్యిందా, మహరాష్ట్ర, తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రాలు తరువాత, ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే, ప్రభుత్వం వైపే వేలు చూపిస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం, ఈ వాదన తోసిపుచ్చుతూ, దేశంలోనే మేము ఎక్కువ టెస్టులు చేస్తున్నామాని, దేశంలోనే టాప్ అని చెప్తుంటే, కేంద్రం ఇస్తున్న డేటాలో మాత్రం, తేడాగా ఉంది. ఏది ఏమైనా ఏపి ప్రభుత్వం, కొన్ని రోజులు రాజకీయాలు పక్కన పెట్టి, కరోనా పై దృష్టి పెడితే, మంచిది.