ఈ రోజు రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ముందు, మాజీ జడ్జి రామకృష్ణ ఇంప్లీడ్ పిటీషన్ పై విచారణ జరిగింది. హైకోర్టుని కంటైంన్మేంట్ జోన్ గా ప్రకటించాలని, అలాగే రిజిస్టార్ జెనెరల్ మృతి పై దర్యాప్తు జరగాలని, దాఖలు అయిన పిటీషన్ పై, పోయిన వారం విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్రం నుంచి, పిటీషన్ తరుపు న్యాయవాది కౌంటర్ ఫైల్ చేసేలా, ఈ రోజుకి వాయిదా వేసారు. అయితే ఈ రోజు పిటీషనర్ తరుపు వాదనలు వినిపిస్తూ, జడ్జి రామకృష్ణ ప్రతి రోజు మీడియా ముందు పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారని, ఈ పిటీషన్ కు విచారణ అర్హత లేదని, ఈ వివాదంతో రామకృష్ణతో ఎటువంటి సంబంధం లేదని, అందుకే రామకృష్ణ ఇంప్లీడ్ పిటీషన్ అనుమతి ఇవ్వద్దు అని వాదించారు. ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం, జస్టిస్ ఈశ్వరయ్య కలిపి కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు, ఈ వ్యవహారంతో, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. జడ్జి రామకృష్ణ సస్పెండ్ అయ్యారని, సర్వీస్ రూల్స్ ప్రకారం, మీడియా ముందుకు రాకూడదని వాదించారు.
అలాగే కేంద్రం తరుపు న్యాయవాది, అసలు మాకు ఈ పిటీషన్ తో సంబంధం లేదని వాదనలు వినిపించారు. ఇక రామకృష్ణ తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఈ మొత్తం వ్యవహారంలో హైకోర్టు పేరుని దెబ్బ తీసే కుట్ర చేస్తున్నారని, మాజీ న్యాయముర్తి ఈశ్వరయ్య, ప్రభుత్వం కలిసి కుట్ర చేస్తున్నాయని, దీనికి సంబందించిన ఆడియో టేప్ లు కూడా తమ దగ్గర ఉన్నాయని, అందుకే తాము ఈ పిటీషన్ లో ఇంప్లీడ్ అవ్వాలని అనుకుంటున్నామని అన్నారు. న్యాయవస్థ పేరును కాపాడటానికే, తాము ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. అలాగే ఈ మొత్తం వ్యవహారం పై, ఈశ్వరయ్య కుట్ర పై, సుప్రీం కోర్టు, లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. తమకు ఈశ్వరయ్య చేస్తున్న కుట్రను చేదించేందుకే, ఈ ఇంప్లీడ్ పిటీషన్ వేశామని అన్నారు. అందుకే తమ ఇంప్లీడ్ పిటీషన్ ను అనుమతించాలని, హైకోర్టు ముందు వాదనలు వినిపించారు. దీని పై తీర్పుని హైకోర్టు వాయిదా వేసింది.