ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన దారుణ ఘటన అయిన, దళిత యువకుడికి శిరోమండనం పై, రాష్ట్రపతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే, దళిత యువకుడికి, శిరోమండనం చేసిన విషయం తెలిసిందే. దీని పై తనకు న్యాయం జరగలేదు అంటూ, తనను నక్సల్స్ లోకి వెళ్ళే అవకాసం ఇవ్వాలని, తానే తనకు జరిగిన ఘటన పై ప్రతీకారం తీర్చుకుంటాను అంటూ, బాధితుడు ప్రసాద్, రాష్ట్రపతి కార్యాలయానికి లేఖ రాసారు. ప్రసాద్ రాసిన లేఖ పై, రాష్ట్రపతి స్పందిస్తూ, రిప్లై ఇచ్చారు. ఏపి జీఏడీకి చెందిన అసిస్టెంట్ సెక్రటరీ జనార్ధన్ బాబుకు ప్రసాద్ ఫైల్ ను, రాష్ట్రపతి కార్యాలయం ట్రాన్స్ఫర్ చేసింది. శిరోమండనం ఘటన పై, పూర్తి స్థాయి ఆధారాలు, కాల్ రికార్డ్స్, వీడియో క్లిప్పింగ్స్ తో సహా, నేరుగా జనార్ధన్ బాబను కలవాలని బాధితుడు ప్రసాద్ కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. ప్రసాద్ కు పూర్తీ సహకారం అందించాలని అసిస్టెంట్ సెక్రటరీ జనార్ధన్ బాబుకు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించింది.
ఘటన జరిగి నెల రోజులు అవుతున్నా తనకు న్యాయం జరగలేదని, తనకు న్యాయం జరిగేలా చూడాలని, లేదా నక్సల్స్ లో కలిసిపోయే అవకాసం ఇవ్వాలని, తానే తనకు న్యాయం జరిగేలా చూసుకుంటాను అంటూ, ప్రసాద్ రెండు రోజుల క్రిందట, రాష్ట్రపతికి ఉత్తరం రాయటం సంచలనంగా మారింది. తనకు ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందలేదని రాష్ట్రపతికి తెలియ చేయటంతో, రాష్ట్రపతి కార్యాలయం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. ప్రసాద్ రాసిన లేఖ అందింది అని, దీని పై పూర్తీ సమాచారంతో, జీఏడీకి చెందిన అసిస్టెంట్ సెక్రటరీ జనార్ధన్ బాబును కలవాలని సూచించింది. ఇప్పటికే మాజీ ఎంపీ హర్ష కుమార్ తో పాటుగా, తెలుగుదేశం పార్టీ కూడా బాధితుడుకి అండగా నిలిచింది. చంద్రబాబు కూడా బాధితుడికి జరిగిన అన్యాయం పై, ఆర్ధిక సాయం కూడా చేసారు. ప్రభుత్వం, కొంత మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేసాం అని చెప్తున్నా, అసలైన వారిని వదిలేసారని, బాధుతుడి ఆవేదన. మరి ఇప్పటికైనా తగు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.