రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన వైఎస్ వివేకా కేసులో, కీలక మలుపు చోటు చేసుకుంది. హైకోర్టు ఆదేశాలు ప్రకారం, సిబిఐ రంగంలోకి దిగింది. ఈ రోజు నుంచి విచారణ ప్రారంభించింది సిబిఐ. 7 గురు సభ్యులతో కూడిన సిబిఐ బృందం, ఈ రోజు కడపలో ఎంటర్ అయ్యారు. కడప ఎస్పీ కార్యాలయంలో, ఈ రోజు సిబిఐ అధికారులు, ఎస్పీతో సమావేశం అయ్యారు. కేసుకు సంబంధించిన పూర్వాపరాలు, విషయాలతో పాటుగా, ఆధారాలు అన్నీ కడప ఎస్పీ దగ్గర నుంచి, సిబిఐ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు, రేపట్లో సిబిఐ అధికారులు పులివెందులలో కూడా అడుగు పెట్టనున్నట్టు సమాచారం. ఎస్పీతో భేటీ అయ్యి, జరిగిన విచారణ తీరుని, చర్చించారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డితో పాటుగా, వైఎస్ వివేకా కూతురు కూడా తమకు సిబిఐ విచారణ కావలి అంటూ, హైకోర్టు లో పిటీషన్ వేసింది. ఈ సందర్భంగా, సొంత సోదరుడు ప్రభుత్వం పైనే ఆరోపణలు చేసింది. ఈ ప్రభుత్వం పై నమ్మకం లేదని ఆమె పిటీషన్ దాఖలు చేసింది.
తమకు పలు అనుమానాలు ఉన్నాయి అంటూ, వైఎస్ కుటుంబంలోని కొంత మంది సభ్యులతో పాటుగా, ఒక ఎంపీ పేరు కూడా, ఆమె అనుమానం వ్యక్తం చేసింది. అప్పట్లో ఇది ఒక పెద్ద సంచలనం అయిన విషయం తెలిసిందే. అన్నీ ఆలోచించిన హైకోర్టు, ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పింది. అయితే, ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే, ఎన్నికల ముందు, సిబిఐ విచారణ కావాలి అంటూ, పిటీషన్ దాఖలు చేసిన జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తరువాత, సిబిఐ విచారణ అక్కరలేదు అంటూ, ఆ పిటీషన్ ను వెనక్కు తీసుకోవటం సంచలనంగా మారింది. ఈ పరిణామం తరువాత, వైఎస్ వివేక కూతురు, ఆరోపణలు చెయ్యటం, హైకోర్టులో సిబిఐ విచారణ కావటం, అన్నీ చకచక జరిగిపోయాయి. ఈ నేపధ్యంలో ఈ రోజు సిబిఐ కడప వచ్చి, ఈ కేసు విచారణ ప్రారంభించారు. దీంతో, ఇప్పుడు అసలు హంతకులు ఎవరు ? ఏమి ఆశించి ఈ హత్య చేసారు ? వెనుక ఉన్న పెద్దలు ఎవరు అనే విషయం పై, సిబిఐ ఏమి బయట పెడుతుందో అనే ఆసక్తి నెలకొంది.