ఆంధ్రప్రదేశ్ లో క-రో-నా వైరస్ జనాన్ని వణికిస్తోంది. రోజు రోజుకి తమ రికార్డులు తామే బ్రేక్ చేసుకుంటూ క-రో-నా పాజిటివ్ కేసులు పెరిగి పోతున్నాయి. రాష్ట్రంలో క-రో-నా మరణాల సంఖ్య మొత్తంగా 365కి చేరుకుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 1935 క-రో-నా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తంగా 31,103 మందిలో క-రో-నా పాజిటివ్ కేసులను గుర్తించారు. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 1935 మందిలో పాజిటివ్ కేసులు గుర్తించినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులిటిన్ స్పష్టం చేసింది. ఈ బులిటిన్ సమాచారాన్ని అనుసరించి రాష్ట్రంలో స్థానికంగా ఉన్నవారిలో 1919 మంది లోను కరోనా పాజిటివ్ కేసులు గుర్తించారు. పొరుగు రాష్ట్రా లకు చెందిన వారు 13 మందిలోను కరోనా పాజిటివ్ కేసులను గుర్తించారు. విదేశాలనుంచి వచ్చిన వారిలో 3 కరోనా పాజిటివ్ గుర్తించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సం ఖ్య 31,103 చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొవిడ్ 37 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇది ఇప్పటి వరకు అతి పెద్ద మరణాల సంఖ్య. మరణించిన వారిలో కర్నూలులో నలుగురు, అనంతపురంలో నలుగురు, శ్రీకాకుళంలో ఒక్కరు, కృష్ణాలో ముగ్గురు, విశాఖపట్టణంలో ఒక్కరు, చిత్తూరులో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, అనంతపురంలో ఆరుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, తూర్పు గోదావరిలో నలుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క-రో-నా మరణాల 365 కి చేరుకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో క-రో-నా నుంచి కోలు కొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయిన వారి సంఖ్య 16464గా ఉంది. అయితే మరణాలు సంఖ్య రోజు రోజుకీ ఎక్కువ అవ్వటం కలవర పెడుతున్న అంశం. ప్రతి రోజు, రెండు వేలకు దగ్గరగా కేసులు వస్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లో కేవలం ఒక్క సిటీకే ఎక్కువ కేసులు పరిమితం అయితే, మనకు మాత్రం, రాష్ట్రం అంతా విస్తరించటం, కలవర పెడుతున్న అంశం.