ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజేల్లో, ఫీజులు తగ్గిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, ఇంజనీరింగ్ కాలేజీలు సుప్రీం కోర్టుకు వెళ్ళటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఉండే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉండే 32 కాలేజీలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, మొదటగా హైకోర్టు డివిజిన్ బెంచ్ కు తరువాత ఫుల్ బెంచ్ కు, తరువాత సుప్రీం కోర్టుకు వెళ్ళాయి. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉండే వసతలు, టీచింగ్ స్టాఫ్, సౌకర్యాలు దృష్టిలో పెట్టుకుని, తమ కాలేజేల్లో ఫీజు తగ్గిస్తే తమకు నిర్వహణ కష్టం అని, ఫీజులు తగ్గిస్తే కష్టం అని ఆ ఇంజనీరింగ్ కాలేజీలు మొదటి నుంచి వాదిస్తున్నాయి. తిరుపతిలో ఉండే మోహన్ బాబు కాలేజీ కూడా ఇందులో కలిసింది. ఇలా రాష్ట్రంలో చాలా కాలేజీలు, చాల హైస్టాండర్డ్స్ మైంటైన్ చేస్తూ, కాలేజీలు నడుపుతున్నాయి. వీటికి కూడా ఫీజులు తగ్గించాలి అంటూ, ప్రభుత్వం ఒత్తిడి తేవటం పై, అభ్యంతరం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీంబార్స్మెంట్ కు తగ్గట్టుగా, తమకు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకుందని, అయితే తమకి ఇలా తగ్గిస్తే నిర్వహణ కష్టం అని కాలేజీలు పేర్కొంటూ, ముందుగా హైకోర్ట్ సింగల్ బెంచ్ ముందుకు వెళ్ళాయి.

అక్కడ అనుకూలంగా తీర్పు ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం డివిజినల్ బెంచ్ కు వెళ్ళింది. అక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ, తీర్పు ఇవ్వటంతో, వాటి పై కాలేజీలు సుప్రీం కోర్టుకు వెళ్ళాయి. ఆదేశించింది. నాణ్యమైన విద్యను అందించలేమని, ఇంజనీరింగ్ కాలేజీలు మూసేయాల్సిన పరిస్థితి అని వాదించారు. అక్కడ విచారణ చేసిన సుప్రీం కోర్టు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉండే సింగల్ బెంచ్ తీర్పు ఇచ్చిందో, ఆ తీర్పుని అమలు చెయ్యమని, తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా, గత ఏడాది ఫీజులు ఉంటాయి. దీంతో పాటు మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, తమ దగ్గర ఉన్న అకాడమిక్ క్యాలెండర్, వసతులు, ఫ్యాకల్టీ వల్లే, తమకు ఉత్తీర్ణతా శాతం ఎక్కువ అని, సుప్రీం కోర్టుకు చెప్పటంతో, ఇవన్నీ బేరీజు వేసుకున్న సుప్రీం కోర్టు, గతంలో మాదిరిగానే ఫీజులు వసూలు చెయ్యాలని ఆదేశాలు వచ్చాయి. త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇవ్వటంతో, ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వేరే ఆప్షన్ లేకుండా పోయింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read